పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్ రణ్‌దావా?: మొగ్గుచూపుతున్న కాంగ్రెస్ హైకమాండ్

By narsimha lodeFirst Published Sep 19, 2021, 3:11 PM IST
Highlights


పంజాబ్ సీఎం గా సుఖ్‌జిందర్ రణ్‌దావా వైపే ఎఐసీసీ మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో  సుఖ్‌జిందర్ రణ్‌దావా వైపే మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గుచూపారని తెలుస్తోంది. 

న్యూఢిల్లీ:పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్ రణ్‌దావాను ఎఐసీసీ ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన అమరీందర్  సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎం పదవికి  అమరీందర్ స్థానంలో రణ్‌దావా వైపే మెజారిటీ ఎమ్మెల్యేలు  మొగ్గుచూపారని తెలుస్తోంది.

also read:పంజాబ్ సీఎంగా నేను చేయలేను: కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన అంబికా సోని.. నెక్స్ట్ సీఎం రేసులో వీరే..

మరో ఐదు నెలల్లో పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో కాంగ్రెస్  పార్టీ నేతల మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి.  పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ, సీఎం అమరీందర్ సింగ్ మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి.  సీఎం పదవి నుండి అమరీందర్ సింగ్ తప్పుకొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ఎఐసీసీ పరిశీలకులు సంప్రదింపులు జరిపిన తర్వాత సుఖ్‌జిందర్ రణ్‌దావా వైపే పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది.జ. అమరీందర్ సింగ్ కేబినెట్ లో సుఖ్‌జిందర్ రణ్‌దావా మంత్రిగా పనిచేస్తున్నారు.పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు చోటు చేసుకొన్నాయి. ఈ తరుణంలో  పంజాబ్ రాష్ట్రానికి కొత్త సీఎం కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

click me!