తల్లిదండ్రుల నిర్లక్ష్యం... పార్కింగ్ లోనే రెండేళ్ల కూతురిని మరిచి 160కి.మీ ప్రయాణం

By Arun Kumar PFirst Published Sep 19, 2021, 2:48 PM IST
Highlights

రెండేళ్ల కన్న కూతురిని పార్కింగ్ స్టాండ్ లో మరిచి ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించారు తల్లిదండ్రులు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. 

జైసల్మేర్: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బయటకు వెళ్లిన ఓ కుటుంబం పసిపాపను పార్కింగ్ స్థలంలోనే వదిలిపెట్టేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 160కిలోమీటర్ల దూరం వెళ్లాక చిన్నారి లేకపోవడాన్ని గమనించి మూడుగంటల తర్వాత తిరిగివచ్చారు. అదృష్టవశాత్తు చిన్నారి అదే పార్కింగ్ స్టాండ్ లో వుండటంతో తీసుకుని వెళ్ళిపోయారు.  

వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ పరిధిలోని సింఘడ్ గ్రామంలోని బాబా రామ్ దేవరా సమాధిని దర్శించుకునేందుకు బజరంగ్ కుటుంబంతో కలిసి వెళ్లాడు. దర్శనం అనంతరం పార్కింగ్ చేసిన కారు వద్దకు వెళ్లిన కుటుంబం రెండేళ్ల చిన్నారిని అక్కడే మరిచి వెళ్లిపోయారు. పాప కారులో ఎక్కిందని భావించిన వారు అక్కడినుండి వెళ్లిపోయారు.

read more  టీచర్ కాదు కీచకుడు: బాలిక బుగ్గ కొరికిన హెడ్‌మాస్టర్.. పోలీసుల ముందే చితకబాదిన జనం

అయితే చిన్నారి ఏడుస్తూ కనిపించడంతో పార్కింగ్ నిర్వహకుడు భోమ్ సింగ్ తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల చూశాడు. ఎక్కడా కనిపించకపోవడంతో అతవద్దే అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే 160కిలోమీటర్ల దూరం వెళ్లాక పాప లేదని గుర్తించిన కుటుంబసభ్యుుల మూడుగంటల తర్వాత తిరిగి అక్కడికి వచ్చారు. అక్కడ పార్కింగ్ స్ధలంలో చిన్నారి కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాపను జాగ్రత్తగా చూసుకున్నందుకు భోమ్ సింగ్‌కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. 
 

click me!