ఓ బూటులో పాము పిల్ల బుసలు కొడుతూ కన్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ: బూటు (షూ)లో చిన్న పాము ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్టు చేశారు. షూ వేసుకొనేందుకు వచ్చిన వ్యక్తి పాము పిల్ల ఉన్న విషయాన్ని గుర్తించాడు. దీన్ని వీడియో తీశాడు. ఈ వీడియో తీసే సమయంలో పాము బుసలు కొట్టింది.ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్టు చేయగానే 1.6 మిలియన్ల మంది వీక్షించారు. షూలు వేసుకొనే సమయంలో జాగ్రత్తగా పరిశీలించాలని కొందరు నెటిజన్లు సూచించారు.
also read:వై.ఎస్. సునీతారెడ్డి ఆత్మీయ సమ్మేళనం: రాజకీయాల్లోకి వస్తారా?
బట్టలు, గొడుగులను కూడ తనిఖీ చేయాలని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. గత ఏడాది తమ అపార్ట్ మెంట్ లోకి దారితప్పిన పాము వచ్చిందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. దాన్ని తాను బయటకు పంపినట్టుగా ఆయన చెప్పారు.
also read:ఎన్‌డీఏలోకి టీడీపీ?: సీట్ల సర్ధుబాటుపై చర్చలు
వాతావరణ మార్పుల కారణంగా పాములు ఇళ్లలోకి వస్తున్నాయని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. విపరీతమైన చలి, విపరీతమైన ఎండ, అతివృష్టి కారణంగా పాములు ఇళ్లలోకి వస్తున్నాయని ఆయన చెప్పారు.
బూట్లలో పాము ఆశ్రయం పొందిన ఘటనలు గతంలో కూడ దేశంలోని పలు చోట్ల చోటు చేసుకున్నాయి. అయితే షూలు ధరించే సమయంలో వాటిని ముందుగా చెక్ చేసుకోవాలని ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి.