అన్ని రాష్ట్రాల విద్యార్థులు సమానమే అని, ఉద్యోగాల్లో అందరికీ న్యాయం జరగాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పరీక్షలన్నీ ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేవలం భాష రాలేదని అవకాశాలను తగ్గించకూడదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పరీక్షలన్నీ ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. దేశంలోని అందరు విద్యార్థులు సమానమే అని, అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమానమైన అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఈ ఏడాది ఏప్రిల్ లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు.
బజరంగ్ పూనియా ఒక అమ్మాయిని ఏర్పాటు చేయాలని కోరాడు - బ్రిజ్ భూషణ్ సింగ్ సంచలన ఆరోపణలు
సీఎం స్టాలిన్ సోమవారం 'ఉంగళిన్ ఒరువన్' వీడియో సిరీస్ లో మాట్లాడారు. అందులో రాష్ట్రంలోని వివిధ రాజకీయ పరిణామాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ‘‘అన్ని ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మనం గళం విప్పాలి’’ అని పిలుపునిచ్చారు.
அறிவுத் திறனை இந்தி, ஆங்கிலம் என்ற குறிப்பிட்ட மொழி எல்லைக்குள் சுருக்கக் கூடாது. அனைத்து ஒன்றிய அரசுத் தேர்வுகளும், அனைத்து மாநில மொழிகளிலும் நடத்தப்பட குரல் கொடுப்போம். வெல்வோம்.
- பகுதியில் முதலமைச்சர் திரு அவர்கள் பதில். pic.twitter.com/r7fhQDaQUp
‘‘ఇది త్వరలో జరగాలి. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ, ప్రజావేదికల్లో డీఎంకే చిరకాల డిమాండ్ ఇది. దీంతో తమిళనాడు యువతే కాకుండా అనేక ఇతర భారతీయ రాష్ట్రాల యువత తమ తమ భాషల్లో పరీక్షలు రాయవచ్చు. కేవలం హిందీ, ఇంగ్లిష్ లో ప్రావీణ్యంతో అవకాశాలను తగ్గించవద్దు’’ అని తెలిపారు. సీఏపీఎఫ్ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని, తమ డిమాండ్ కు సానుకూల ఫలితం వచ్చిందని చెప్పారు. అన్ని కేంద్ర పరీక్షలను ఆయా భాషల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశ వనరులు ఎవరికీ చేరుతున్నాయో తెలియడం లేదు.. అందుకే దేశవ్యాప్త ఎన్ఆర్సీ అవసరం - హిమంత బిశ్వ శర్మ
‘‘భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. కాబట్టి అన్ని రాష్ట్రాల యువతకు సమాన అవకాశాలు రావాలి. మొట్టమొదటగా మా డిమాండ్ కు సానుకూల ఫలితం లభించింది. అన్ని కేంద్ర ప్రభుత్వ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని గళం విప్పుదాం. ఇందులో మనం గెలుస్తాం.’’ అని ఆయన పేర్కొన్నారు.