డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం..

Published : May 02, 2023, 02:12 PM ISTUpdated : May 02, 2023, 02:28 PM IST
డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం..

సారాంశం

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను హోసకోటే సమీపంలో పక్షి ఢీకొట్టింది. 

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ప్రమాదం తప్పింది. డీకే శివకుమమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ముందు భాగం దెబ్బతింది. ముందు అద్దం కొంత భాగం పగిలిపోయింది. అయితే పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఒక్కరికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. వివరాలు.. ఈ రోజు ఉదయం బెంగళూరు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Also Read: రాహుల్ గాంధీ అభిమానిగా ఇక్కడికి వచ్చాను..: కాంగ్రెస్ ప్రచార సభలో నటుడు శివరాజ్ కుమార్

అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ ముళబాగిలుకు బయలుదేరారు. దాదాపు 12 గంటల ప్రాంతంలో జక్కూరు నుంచి డీకే శివకుమార్ హెలికాప్టర్ బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హోసకోటే సమీపంలో గాలిలో ఉండగానే ఒక డేగ ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్‌ను హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం  తప్పిందని డీకే శివకుమార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..