బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి మీద కత్తితో దాడి, తానూ పొడుచుకుని..

Published : Jan 03, 2023, 01:28 PM IST
బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి మీద కత్తితో దాడి, తానూ పొడుచుకుని..

సారాంశం

బెంగళూరులో ప్రేమోన్మాది బరితెగించాడు. ప్రేమను నిరాకరించందని అందరూ చూస్తుండగా.. తోటి విద్యార్థినిని కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత తానూ పొడుచుకున్నాడు. 

బెంగళూరు : కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఏకంగా కాలేజీలో విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా రక్తం మరకలతో బీభత్సంగా తయారయ్యింది. తను ప్రేమించిన అమ్మాయి తననే ప్రేమించాలని పైశాచికత్వంతో తోటి విద్యార్థులు చూస్తుండగానే తన తోటి విద్యార్థినిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. దీనికి ప్రేమను నిరాకరించడమే ఆమె చేసిన తప్పు. 

ఆ తరువాత ఆ ప్రేమోన్మాది తనను కూడా పొడుకున్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషాద ఘటన బెంగళూరు నగర శివారులోని యలహంక సమీపంలోని రాజనకుంటెలో జరిగింది. రాజనకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగింది. బాధితురాలైన విద్యార్థిని పేరు లయస్మిత (20). ఆమెను తన తోటి విద్యార్థి, తన గ్రామానికే చెందిన పవన్ కుమార్ అనే యువకుడు ప్రెమించమంటూ వేధిస్తున్నాడు. వీరిద్దరూ ఒకే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. 

వీరికి కోలారు పట్టణ సమీప గ్రామం. ఒకే ఊరు కావడంతో రెగ్యులర్ గా ఏదో ఒకటి మాట్లాడుకునేవారు. దీంతో పవన్ ఆమెను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. కానీ, దీనికి ఆమె ఒప్పుకోలేదు. తన ప్రేమను ఒప్పుకోలదని పవన్, లయస్మిత మీద కోపం పెంచుకన్నాడు. సోమవారం నాడు కూడా పవన్ మరోసారి తన ప్రేమ గురించి లయస్మిత దగ్గర మాట్లాడాడు. దీంతో ఆమె అతడిని తిట్టింది. 

కోపంతో ఊగిపోయిన పవన్ కాలేజీలో అందరూ చూస్తుండగానే ఆమెను ఇష్టానుసారం కత్తితో పొడిచాడు. ఆ తరువాత తనను తాను పొడుకున్నాడు.. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే మిగతా వారు వీరిద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే లయస్మిత మరణించిందని డాక్టర్లు దృవీకరించారు. పవన్ కు తీవ్ర గాయాలయ్యాయని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనతో యూనివర్సిటీలో భయాందోళనలు నెలకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu