మ‌ద్యం తాగ‌డానికి, గొడ్డు మాంసం తినడానికి నిరాక‌రించాడ‌ని క‌ర్ర‌ల‌తో దాడి... !

By Mahesh RajamoniFirst Published Jan 3, 2023, 12:50 PM IST
Highlights

Jharkhand: మ‌ద్యం తాగడానికి, గొడ్డు మాంసం తినడానికి నిరాకరించినందుకు ఒక వ్య‌క్తిని తీవ్రంగా కొట్టారు. పోలీసులు ఈ ఘ‌ట‌న గురించి పేర్కొంటూ.. జార్ఖండ్ లో గొడ్డు మాంసం తినడానికి నిరాకరించినందుకు ఒక వ్యక్తిని ఐదుగురు దుండగులు కర్రలు, రాళ్లతో కొట్టారు. కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు.
 

man thrashed for refusing to drink alchohol, eat beef:  కొత్త సంవ‌త్స‌రం (2023) రోజున చోటుచేసుకున్న ఒక  షాకింగ్ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మ‌ద్యం తాగడానికి, గొడ్డు మాంసం తినడానికి నిరాకరించినందుకు ఒక వ్య‌క్తిని తీవ్రంగా కొట్టారు. ఆ వ్య‌క్తిపై పిడిగుద్దులు కురిపించ‌డంతో పాటు క‌ర్ర‌ల‌తో క్రూరంగా దాడి చేశారు. జార్ఖండ్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. దీనిపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. 

ఈ దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లోని రాధానగర్ గ్రామంలో మద్యం తాగ‌డానికి, గొడ్డు మాంసం తినడానికి నిరాకరించినందుకు ఒక వ్యక్తిని ఐదుగురు వ్యక్తులు కర్రలు, రాళ్లతో కొట్టారు. నూతన సంవత్సర పండుగ సందర్భంగా రెడ్ మీట్ తినడానికి నిరాకరించినందుకు తనను ఐదుగురు వ్యక్తులు కొట్టారని చందన్ రవిదాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మిథున్ షేక్‌తో పాటు మరో నలుగురిపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

చందన్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి పకింజా మోర్‌లోని ఓ దుకాణానికి వెళ్లాడు. షాపు వెనకాల వెళ్లి చూడగా ఐదుగురు వ్యక్తులు ఆవు మాంసం తింటూ.. మ‌ద్యం తాగుతూ తీసుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారి మ‌ధ్య‌ తీవ్ర వాగ్వాదం జరిగింది, దాని తర్వాత ఐదుగురు వ్యక్తులు అతనికి గొడ్డు మాంసం తినిపించడానికి ప్రయత్నించారు. నిందితులు రవిదాస్ మొబైల్ తీసుకుని రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. ఒంటిపై బ‌ట్ట‌లు లేకుండా చేసి.. తీవ్రంగా కొట్ట‌డంతో పాటు త‌న వ‌ద్ద డ‌బ్బును సైతం ఎత్తికెళ్లార‌ని బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి త‌మ‌కు ఫిర్యాదు అందిందనీ, విచారణ జరుపుతున్నామని రాధానగర్‌ పోలీస్‌ స్టేషన్ ఎస్సై రాకేష్‌ కుమార్ తెలిపిన‌ట్టు ఇండియా టుడే నివేదించింది.


 

click me!