నాలుగు నెలల చిన్నారిని పొట్టనబెట్టుకున్న వీధికుక్కలు.. గదిలో నిద్రిస్తుంటే.. లాక్కెళ్లి మరీ కరిచి చంపాయి..

By SumaBala BukkaFirst Published Apr 24, 2023, 3:31 PM IST
Highlights

ఓ నాలుగు నెలల చిన్నారిని వీధికుక్కలు కరిచి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. గదిలో నిద్రిస్తున్న చిన్నారిని లాక్కెళ్లి మరీ చంపాయి. 

ఉత్తరప్రదేశ్ : దేశవ్యాప్తంగా వీధి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల  ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ లో వీధి కుక్కల దాడిలో రిటైర్డ్ డాక్టర్ ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి అమానుషంగా చంపేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. ఉత్తర ప్రదేశ్,  అలీఘర్లోని స్వర్ణజయంతి నగర్ ప్రాంతంలో నాలుగు నెలల చిన్నారిని వీధి కుక్కలు కరిచి చంపాయి. 

ఇంట్లో గదిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న చిన్నారిని నోట కరచుకుని మరీ వీధిలోకి లాక్కెళ్లాయి. ఓ వీధి కుక్క ఇంట్లోకి ప్రవేశించి గదిలో నిద్రిస్తున్న చిన్నారి మీద దాడికి పాల్పడింది. చిన్నారిని నోట కరుచుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ఉన్న అన్ని కుక్కలు ఆ చిన్నారి మీద దాడి చేశాయి. శరీర భాగాలను చీల్చాయి. తీవ్ర గాయాలు కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

Latest Videos

ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతుండగా.. తల్లిదండ్రులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. చిన్నారి నిద్రపోవడంతో ఓ గదిలో పడుకోబెట్టి వారు తమ పనుల్లో తాము ఉన్నారు. ఎలా ప్రవేశించిందో ఓ వీధి కుక్క ఆ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న పసికందును నోట కరచుకుని నిర్మానుష ప్రదేశానికి పరిగెత్తింది. కుక్క నోట్లోని పసికందును చూసి మిగతా కుక్కలు వెంటపడ్డాయి.

2014కు ముందు పంచాయతీలకు రూ.17 వేల కోట్లే ఇచ్చేవాళ్లు.. దానిని మేము రూ. 2 లక్షల కోట్లకు పెంచాం - ప్రధాని మోడీ

అన్నీ కలిసి చిన్నారిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాసేపటికి తల్లిదండ్రులు చిన్నారి కోసం వెతకగా గదిలో కనిపించకపోవడంతో.. చుట్టుపక్కల గాలించారు. అప్పటికే చిన్నారిని కుక్కలు చుట్టూ ముట్టడం గమనించి రక్షించడానికి ప్రయత్నించారు.  కానీ అప్పటికే చిన్నారి మృతి చెందింది ఈ దారుణమైన ఘటన మీద చిన్నారి తండ్రి పవన్ మాట్లాడుతూ.. నా బిడ్డను వీధి కుక్కలు ఎత్తుకెళ్లాయని చూసిన వాళ్ళు చెప్పారు.

వెంటనే వాటిని  తరిమేందుకు పరిగెత్తాను.. కానీ, అప్పటికి ఆలస్యం అయిపోయింది. నా బిడ్డను చీల్చి ముక్కలుగా చేశాయి.. అంటూ   ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. అయితే, వీధి కుక్కలు ఈ కుటుంబం మీద దాడి చేయడం కొత్త కాదని ఇంతకుముందు కూడా దాడి చేశాయని ఆ చిన్నారి అమ్మమ్మ చెప్పుకొచ్చారు. 

click me!