వార్నీ.. చీరల కోసం లొల్లి.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..

Published : Apr 24, 2023, 02:13 PM IST
వార్నీ.. చీరల కోసం లొల్లి.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..

సారాంశం

ఆఫర్లో వచ్చే చీర కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కర్ణాటక : కర్ణాటకలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దీని గురించి తెలిసిన వారందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం విచిత్రం అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. వీధి పంపుల దగ్గర  జుట్లు జుట్లు పట్టుకుని గొడవపడ్డట్టుగా.. ఓ చీర కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు.  ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.  తగ్గింపు ధరలకు చీరలను అమ్మే దుకాణంలో  ఇది వెలుగు చూసింది.  

వివరాలలోకి వెళితే.. బెంగళూరు మల్లేశ్వరం 8వ మెయిన్ రోడ్డులోని ఒక షాపులో చీరలను తగ్గింపు ధరలకు అమ్ముతున్నారు. మైసూరు పట్టు చీరలు 35% తగ్గింపు ధరలు అని బోర్డు కూడా పెట్టారు.దీంతో మహిళలు ఎగబడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో పోటెత్తారు.  

అపార్ట్ మెంట్లోకి చొరబడ్డ ముసుగు వ్యక్తులు.. ఫ్లాట్ డోర్ మీద కాల్పులు జరిపి పరార్...

ఈ సమయంలోనే ఒక చీరను ఇద్దరు మహిళలు ఇష్టపడ్డారు. తనకే కావాలంటే.. తనకే కావాలంటూ పట్టు పట్టారు. ఆ చీరను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. దీంతో గొడవ మొదలయ్యింది. అది కాస్తా జుట్లు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్ళింది.

దీన్నంతా అక్కడే ఉన్న మరి కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఆ ఇద్దరు మహిళలను మిగతా మహిళలు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి విడిపించారు. 

ఆ మహిళలు కూడా నాగరికులు, చదువుకున్న వారిలాగే వారి వేషధారణ ఉంది. ఒక్క చీర కోసం ఇలా కొట్టుకోవడం.. జుట్టు మొత్తం ఊడిపోయేలా ఒకరి మీద ఒకరు దాడికి దిగడం.. చూసిన మిగతా వారు ఆశ్చర్యపోయారు.

 

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే