ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా.. దయచేసి పాకిస్థాన్ కు తిరిగి వచ్చేయ్ - సీమా హైదర్ కు భర్త విజ్ఞప్తి

Published : Jul 17, 2023, 03:47 PM IST
ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా.. దయచేసి పాకిస్థాన్ కు తిరిగి వచ్చేయ్ - సీమా హైదర్ కు భర్త విజ్ఞప్తి

సారాంశం

పాకిస్థాన్ కు చెందిన సీమా అనే మహిళ అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి యూపీలోని నోయిడాలో సచిన్ యువకుడితో నివసిస్తోంది. ఆమెకు సంబంధించిన వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే ఆమెను తిరిగి పాకిస్థాన్ కు రావాలని భర్త విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆమెను ప్రేమిస్తున్నానని తెలిపారు. 

2019లో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన తర్వాత హిందూ యువకుడితో కలిసి జీవించడానికి అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన సీమా హైదర్ పై ఉన్న ప్రేమను ఆమె భర్త గులాం హైదర్ వ్యక్తం చేశాడు. ఇప్పటికీ తన భార్యను ప్రేమిస్తున్నానని, తిరిగి పాకిస్థాన్ కు వచ్చేయాలని అతడు విజ్ఞప్తి చేశారు. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా.. యూపీలోని సచిన్ మీనాతో ప్రేమలో పడి తన పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు ఈడీ కూడా మా కోసం ఎన్నికల ప్రచారం చేస్తోంది - డీఎంకే మంత్రి నివాసాల్లో రైడ్ పై సీఎం స్టాలిన్ కామెంట్లు

ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఆమె మొదటి భర్త గులాం హైదర్.. తన భార్యను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని పాకిస్తాన్ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపినట్టు ‘‘ఇండియా టుడే’’ నివేదించింది. తాను పిల్లల విషయంలో ఆందోళన చెందుతున్నాని అన్నారు. తన వద్దకు తిరిగి రావాలని కోరుకుంటున్నాని చెప్పారు. ‘‘నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసు. అక్కడ నీకేమైనా అయితే మన పిల్లలకు ఏం జరుగుతుందో ఆలోచించు. వాళ్ల బాధ్యత ఎవరు తీసుకుంటారు ? కాబట్టి వాళ్ల కోసమైనా దయచేసి తిరిగి వచ్చేయు’’ అని తెలిపారు. 

‘‘నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను. దానిని అలాగే కొనసాగిస్తాను. పిల్లలను, నిన్ను చాలా మిస్ అవుతున్నా. నిన్ను ఎవరూ ఏమీ అనరు. నిన్ను నాతోనే ఉంచుకుంటాను, మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. పాకిస్థాన్ లో నీకు భద్రత లేదని భావిస్తే మనం సౌదీ వెళ్లిపోదాం. పిల్లలతో పాటు మనం అక్కడే సెటిల్ అవుదాం’’ అని గులాం హైదర్ అన్నారు. 

రూ.90 వేల అప్పును తిరిగి ఇవ్వమన్నందుకు మేనమామను హత్య.. ఆరు ముక్కలుగా నరికి, పూడ్చిపెట్టిన మేనళ్లుడు..

అయితే పిల్లలు ‘హిందుస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు చేయడంపై ఆ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు గులాం సమాధానమిస్తూ..వాళ్లు పిల్లలు అని, ఇప్పుడు అడిగితే పాకిస్థాన్ జిందాబాద్ అని కూడా అంటారని అన్నారు. తన మొదటి భార్యను వదిలేసి సీమ కోసం మరింత డబ్బు సంపాదించేందుకే సౌదీ అరేబియా వెళ్లినట్లు గులాం వెల్లడించాడు. గతంలో తాను సీమకు నెలకు రూ.40-50 వేలు పంపేవాడినని, కానీ తరువాత రూ.80-90 వేలు పంపించానని అన్నారు. ఆ డబ్బుతో పిల్లలను బాగా చూసుకుంటుందని అనుకున్నాని తెలిపారు.

ఓ సమయంలో తన వద్ద డబ్బు లేకపోయినా సీమ సొంతంగా ఇళ్లు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఆమెకు రూ.17 లక్షలు ఇచ్చానని అన్నారు. తన భార్య గురించి ఎవరూ అసత్యాలు ప్రచారం చేయకూడదని ప్రజలకు గులాం విజ్ఞప్తి చేశారు. కేవలం కొన్ని లైక్స్ కోసం కొందరు సోషల్ మీడియాలో తన భార్యను కించపరుస్తున్నారని, ఇది పూర్తిగా తప్పు అని ఆయన అన్నారు.

తన భార్య బిడ్దలను పాకిస్థాన్ కు పంపించాలని భారత ప్రభుత్వానికి గులాం విజ్ఞప్తి చేశారు. తన భార్యను ప్రలోభాలకు గురిచేసి పబ్జీ ద్వారా ఇండియాకు రప్పించారని ఆరోపించారు. తన భార్యను పాకిస్థాన్ కు పంపిస్తే, తాము సంతోషంగా ఓ కుటుంబంగా కలిసి జీవిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

మళ్లీ ఎల్ వోసీ వెంట ఉగ్రవాదుల చొరబాటు యత్నం.. తిప్పికొట్టి, ఇద్దరిని హతమార్చిన ఆర్మీ..

కాగా.. 2019లో గేమింగ్ యాప్ పబ్జీలో మాట్లాడుకుంటున్న సమయంలో సీమా, యూపీలో ఉండే సచిన్ ప్రేమలో పడ్డారు. దీంతో ఆమె నేపాల్ మీదుగా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించింది. తరువాత సచిన్, సీమ, నలుగురు పిల్లలతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. అయితే ఆమె నేపాల్ మీదుగా వీసా లేకుండా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినందుకు జూలై 4న పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించినందుకు సచిన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ శుక్రవారం బెయిల్ మంజూరైంది.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?