రైతులకు నిర్మలా గుడ్ న్యూస్: దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకొనేలా చట్టం

By narsimha lode  |  First Published May 15, 2020, 5:23 PM IST

రైతులు తమ ఉత్పత్తులను మెరుగైన ధరకు అమ్ముకొనే అవకాశం కల్పించేలా కేంద్రం చట్టం తెస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
 


న్యూఢిల్లీ:రైతులు తమ ఉత్పత్తులను మెరుగైన ధరకు అమ్ముకొనే అవకాశం కల్పించేలా కేంద్రం చట్టం తెస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

శుక్రవారం నాడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పరిస్థితులు వాతావరణానికి తగ్గట్టుగా పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అనుకూలంగా మార్పులు చేశామన్నారు. రైతులకు లాభం కల్గించడం, వినియోగదారులకు ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొవడం దీని ఉద్దేశ్యమన్నారు. 

Latest Videos

రైతులు పండించిన పంటల ధరలను దళారులు ప్రభావితం చేయడం, డిమాండ్ ను పెంచేందుకు సప్లయ్ ను అదుపు చేసేలాంటి చర్యలకు ఇక చెక్ చెప్పడమే తమ ఉద్దేశ్యమన్నారు మంత్రి.  వినియోగదారులకు అందుబాటులో ధరలు ఉండేలా చర్యలు తీసుకొంటామని కేంద్రం ప్రకటించింది.

రాష్ట్రాల మధ్య రైతులు తమ పంటను తరలించేందుకు కూడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటామన్నారు. రైతు పండించిన పంటను నిర్జిష్టమైన ప్రాంతంలోనే కొద్ది మందికే ఎందుకు అమ్ముకోవాలి, మెరుగైన ధరకు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా రైతు అమ్ముకొనేలా చర్యలు తీసుకొంటామని ఆమె స్పష్టం చేశారు.

also read:లోకల్ ఉత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధి: నిర్మలా సీతారామన్

పంట వేసే సమమయంలో రైతుకు కనీస మద్దతు ధర ఎంతో తెలిసేలా నిర్ధిష్ట కార్యాచరణ ప్రకటించేలా చర్యలు తీసుకొంటామని మంత్రి హామీ ఇచ్చారు.  ఈ తరహా ఏర్పాట్లతో లాభసాటి పటలను రైతులు ఎంచుకొనేందుకు వీలు కలుగుతోందన్నారు. 

సాంకేతికపరమైన సలహాలు, విత్తనాల లాంటి సహాయం వంటికి రైతులకు అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసుకొంటుందన్నారు. దీంతో రైతు మద్దతు ధర నష్టపోవడం అనేది జరగదని మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
 

click me!