రైతులకు వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధికి రూ. 1 లక్ష కోట్లను కేటాయిస్తున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అగ్రిగేషన్ పాయింట్ల వద్ద మౌళిక సదుపాయాల నిధులను సమకూర్చడానికి లక్ష కోట్ల రూపాయాల ఫైనాన్స్ సౌకర్యం కల్పించనున్నట్టు ఆమె చెప్పారు.
న్యూఢిల్లీ: రైతులకు వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధికి రూ. 1 లక్ష కోట్లను కేటాయిస్తున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అగ్రిగేషన్ పాయింట్ల వద్ద మౌళిక సదుపాయాల నిధులను సమకూర్చడానికి లక్ష కోట్ల రూపాయాల ఫైనాన్స్ సౌకర్యం కల్పించనున్నట్టు ఆమె చెప్పారు.
శుక్రవారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో 20 నుండి 25 శాతం పాల డిమాండ్ తగ్గిందని కేంద్ర మంత్రి చెప్పారు. సహకార సంఘాలు 560 లక్షల లీటర్ల స్థానంలో 360 లక్షల లీటర్లు మాత్రమే విక్రయించారని ఆమె తెలిపారు. రైతుల నుండి 111 కోట్ల లీటర్ల పాల సేకరణకు రూ. 4100 కోట్లు ఖర్చు చేశామన్నారు.
దేశంలో 85 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధం రంగాలకు ప్రత్యేక ప్యాకేజీని అందించనున్నట్టుగా తెలిపారు. మత్స్య, డెయిరీ, పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు ప్యాకేజీలను ప్రకటించారు.
ధాన్యం, గోధుమల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధిని సాధించినట్టుగా చెప్పారు. దేశంలో 85 శాతం వ్యవసాయ కమతాలు చిన్న, సన్నకారు రైతులవేనని మంత్రి గుర్తు చేశారు.
also read:నెల రోజుల్లో వీధి వ్యాపారులకు ప్రత్యేక స్కీమ్: నిర్మలా సీతారామన్
మత్స్య, డెయిరీ పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ కోసం 11 అంశాల్లో రాయితీలు కల్పిస్తున్నట్టుగా ఆమె తెలిపారు. లాక్ డౌన్ సమయంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు కు రూ. 74,300 కోట్లు ఖర్చు చేశామన్నారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.6400 కోట్లు చెల్లించామన్నారు.
పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. లాక్ డౌన్ కాలంలో మిగిలిన పాలను సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేశామన్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో పాల ఉత్పత్తిదారులకు సహకార సంస్థలకు సంవత్సరానికి 2 శాతం వడ్డీ ఉపసంహరణ పథకాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. దీని ద్వారా రూ. 5 వేల కోట్ల ప్రయోజనం కలుగుతోందన్నారు.