SSC Scam Bengal : ఎవ‌రీ అర్పితా ముఖర్జీ ? వెస్ట్ బెంగాల్ మంత్రి పార్ట ఛ‌ట‌ర్జీకి ఆమెకు ఏంటి సంబంధం.. ?

Published : Jul 23, 2022, 10:05 AM ISTUpdated : Jul 23, 2022, 10:06 AM IST
SSC Scam Bengal : ఎవ‌రీ అర్పితా ముఖర్జీ ? వెస్ట్ బెంగాల్ మంత్రి పార్ట ఛ‌ట‌ర్జీకి ఆమెకు ఏంటి సంబంధం.. ?

సారాంశం

వెస్ట్ బెంగాల్ లోని మంత్రులు, వారి సన్నిహితుల ఇళ్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కుప్పలు కుప్పులుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అలాగే ముఖ్యమైన డ్యాకుమెంట్లు, ఇతర ఆధారాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

పశ్చిమ బెంగాల్ లో ఉద్యోగ నియామ‌కాల్లో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు వెలుగులోకి వ‌చ్చాయి. శుక్ర‌వారం ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వ‌హించ‌డంతో ఇది బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ప్రాంగణంలో జరిగిన సోదాల్లో 20 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుకు ఎస్‌ఎస్‌సీ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ డ‌బ్బును లెక్కించ‌డానికి నోట్ల లెక్కింపు యంత్రం సాయం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. 

వైరల్ వీడియో : విమానంలో తల్లిదండ్రులకు స్వీట్ సర్ ఫ్రైజ్ ఇచ్చిన పైలట్..

ఈ దాడిలో 20కి పైగా మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పరేష్‌ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య తదితరుల ఇళ్లపైనా సోదాలు జరిగాయి. ఆ ఇళ్ల నిండా నోట్ల కొండలా పడి ఉన్న కోట్లాది రూపాయలను చూసి అందరూ షాక్ అయ్యారు. ఖరగ్‌పూర్ క్యాంప్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో పాటు 80-90 మంది ఈడీ అధికారుల బృందాలు కలిసి 14 ప్రాంతాల్లో దాడులు చేశాయి. సాయంత్రానికి కోటి రూపాయల రికవరీ అయిన‌ట్టు వార్త‌లు రావడం మొదలయ్యాయి. 

ఇందులో ప్ర‌ధానంగా అర్పితా ముఖర్జీ ఫ్లాట్‌లోనే సుమారు 11 గంట‌ల పాటు ఈడీ అధికారులు దాడులు జ‌రిపారు. అక్క‌డ నుంచి రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు . ఈ బ్యాగుల్లో మొత్తం నోట్ల క‌ట్ట‌లు బ‌యటకు వ‌చ్చాయి. అందులో మొత్తం 2000, 500 రూపాయల నోట్ల కట్టలు క‌నిపించ‌డంతో అధికారులు కూడా ఖంగుతున్నారు. మొత్తంగా ఆ ఇంట్లో నుంచి రూ.20 కోట్లు ను అధికారులు రిక‌వ‌రీ చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో న‌గ‌దు బ‌య‌ట‌ప‌డిన అర్పితా ముఖర్జీ ఎవ‌ర‌నేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. 

Karnataka Lip-lock video : బ్లాక్ మెయిల్ చేసి విద్యార్థినులపై లైంగిక వేధింపులు, 8 మంది విద్యార్థులు అరెస్ట్...

అర్పితా ముఖర్జీ గురించి జనాలకు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియదు. ఆమె మంత్రి పార్థ ముఖర్జీకి సన్నిహితురాలు. నటి, మోడల్ గా ఉన్న అర్పిత ఒడిశా చిత్ర పరిశ్రమలో నటించింది. ఆమె అనేక తమిళ చిత్రాలకు కూడా పనిచేసింది. మామా-భంగే, పార్టనర్ తో క‌లిసి బెంగాలీ చిత్రాలలో కూడా ఆమె న‌టించారు. మూలాల ప్రకారం.. ఆమె చాలా సంవత్సరాలుగా నక్తలా పూజను ప్రమోట్ చేస్తోంది. అలాగే అర్పితా బెహలా వెస్ట్ సెంటర్‌లో పార్థ ఛటర్జీతో కలిసి కొన్ని సార్లు ప్రచారం చేయడం కూడా క‌నిపించింద‌ని ‘జీ న్యూస్’ వెల్లడించింది. గత కొన్నేళ్లుగా దక్షిణ కోల్‌కతాలోని ఓ విలాసవంతమైన ఫ్లాట్‌లో నివసిస్తోంది

గ్రూప్ సీ, డీ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల సీబీఐను ఆదేశించడంతో ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. అయితే డబ్బు నోట్ల కట్టల రికవరీ తరువాత వాటిని లెక్కించడానికి ఈడీ బ్యాంకు అధికారులను పిలవాల్సి వచ్చింది. దాని కోసం డబ్బు లెక్కించే యంత్రాల సహాయం కూడా తీసుకున్నారు. అలాగే ఈ దాడిలో పలు ముఖ్యమైన డాక్యుమెంట్లు, రికార్డులు, అనుమానాస్పద కంపెనీల వివరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీ, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !