India Covid Update: భారత్‌లో 1.50 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు..

Published : Jul 23, 2022, 10:05 AM IST
India Covid Update: భారత్‌లో 1.50 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు..

సారాంశం

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కిందటి రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్తా తక్కువగా ఉంది. శుక్రవారం కరోనా నుంచి  20,726 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,31,92,379కి చేరింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నర మార్క్‌ను దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు  1,50,100కి చేరింది. 

మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశంలో 67 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,25,997కి చేరింది. దేశంలో ప్రస్తుతం కరోనా రోజువారి పాజిటివ్ రేటు 4.46 శాతంగా ఉంది. ఇక, యాక్టివ్ కేసులు 0.34 శాతం, రికవరీ రేటు 98.46 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయి.

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుంది. దేశంలో శుక్రవారం 34,93,209 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,01,68,14,771 కి చేరింది.  ఇక, శుక్రవారం రోజున దేశంలో మొత్తం 4,80,202 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా కేంద్రం తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 87,21,36,407కి చేరింది. 
 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్