లోక్ సభలో హనుమాన్ చాలీసా పఠనం.. ఉద్ధవ్ సేనపై ఎంపీ విమర్శలు

By Mahesh K  |  First Published Aug 9, 2023, 12:27 AM IST

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా ఏక్‌నాథ్ షిండే కొడుకు, ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ ఉద్ధవ్ సేనపై మండిపడ్డారు. రాష్ట్రంలో హనుమాన్ చాలీసా పఠించే స్వేచ్ఛ ఇవ్వలేదని అన్నారు. లోక్ సభలోనే ఆయన హనుమాన్ చాలీసా పఠించారు.
 


న్యూఢిల్లీ: లోక్ సభలో మహారాష్ట్రకు చెందిన ఓ ఎంపీ హనుమాన్ చాలీసా పఠనం చేశారు. మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా పఠనం చేయడానికీ స్వేచ్ఛ ఇవ్వలేదని ఉద్ధశ్ సేనపై విమర్శలు సంధించారు. ఎంపీ నవనీత్ కౌర్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం ముందు హనుమాన్ చాలీసా పఠించే ప్రయత్నం చేయగా అడ్డుకున్న ఘటనను పరోక్షంగా ప్రస్తావించారు. ఉద్ధశ్ ఠాక్రే పై ఏక్‌నాథ్ షిండే కొడుకు ఎంపీ శ్రీకాంత్ షిండే నిప్పులు చెరిగారు.

కేంద్రపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానానికి ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ఇస్తున్నదని ఎంపీ శ్రీకాంత్ షిండే మండిపడ్డారు. వచ్చే రోజుల్లో ఎన్నికలు ఎన్డీయే వర్సెస్ ఇండియా కాదని, స్కీం వర్సెస్ స్కాం అని అన్నారు. అవినీతికి మరోపేరు ఇండియా కూటమి అని పేర్కొన్నారు.

Latest Videos

Also Read: నెలవారీగా లంచం సమర్పించకోవాలని మంత్రి డిమాండ్!.. ఆ శాఖ డైరెక్టర్ల లేఖతో కలకలం.. సీఎం సిద్ధరామయ్య ఏమన్నారంటే?

అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ఈ రోజు శ్రీకాంత్ షిండే మాట్లాడారు. 2019లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ ‌తో చేతులు కలపడాన్ని తాను ఊహించలేదని అన్నారు. కరసేవకులపై దాడి చేసిన సమాజ్‌వాదీ పార్టీతోనూ ఉద్ధవ్ ఠాక్రే సేన చేతులు కలిపేలా ఉన్నదని ఆరోపించారు.

click me!