చొరబాటు పేరుతో మరో 12మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక.. ఇప్పటివరకు 55 కు చేరుకున్న సంఖ్య..

Published : Dec 20, 2021, 01:16 PM IST
చొరబాటు పేరుతో మరో 12మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక.. ఇప్పటివరకు 55 కు చేరుకున్న సంఖ్య..

సారాంశం

రామేశ్వరం నుంచి వెళ్లిన 43 మంది శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసి ఆరు ఫిషింగ్ బోర్డ్ లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దీంతోపాటు శ్రీలంక నావికాదళం మరో 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. తమ దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడినట్లు ఆరోపిస్తూ 12 మంది జాలర్లను అదుపులోకి తీసుకుని 2 ఫిషింగ్ బోర్డ్ లను స్వాధీనం చేసుకుంది. గత రెండు రోజుల్లో శ్రీలంక నేవీ అరెస్టు చేసిన భారతీయుల సంఖ్య దీంతో 55 చేరుకుందని సోమవారం అధికారులు ప్రకటించారు.

శ్రీలంక నావికాదళం మరోమారు Indian fishermenపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ tamilnaduకు చెందిన మత్యకారులను అరెస్టు చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న ఆరు పడవలను సైతం స్వాధీనం చేసుకుంది. అనంతరం శ్రీలంక నావికాదళం వారిని కంగెసంతురాయ్ శిబిరానికి తీసుకెళ్లారు. 

ఈ వివరాలను తమిళనాడు మత్స్యశాఖ అధికారి ఆదివారం ప్రకటించారు. రామేశ్వరం నుంచి వెళ్లిన 43 మంది శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసి ఆరు ఫిషింగ్ బోర్డ్ లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దీంతోపాటు శ్రీలంక నావికాదళం మరో 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. తమ దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడినట్లు ఆరోపిస్తూ 12 మంది జాలర్లను అదుపులోకి తీసుకుని 2 ఫిషింగ్ బోర్డ్ లను స్వాధీనం చేసుకుంది. గత రెండు రోజుల్లో శ్రీలంక నేవీ అరెస్టు చేసిన భారతీయుల సంఖ్య దీంతో 55 చేరుకుందని సోమవారం అధికారులు ప్రకటించారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న తమిళ జాలర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది.  శ్రీలంక తీరుకు నిరసనగా మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు చొరవ తీసుకుని మత్స్యకారులను విడిపించాలని.. వారి కుటుంబాలు కోరుతున్నాయి. కాగా.. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి.  

రోహిణి కోర్టులో బాంబు పెట్టిన శాస్త్రవేత్త జైల్లో ఆత్మహత్యాయత్నం...

శ్రీలంక చేసింది అన్యాయమని, తమిళనాడుకు చెందిన మత్స్యకారుల విడుదల కోసం శ్రీలంక అధికారులతో వెంటనే మాట్లాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తమిళనాడుకు చెందిన కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ఇప్పటికే భారత ప్రభుత్వ ఉన్నత అధికారులతో చర్చలు ప్రారంభించారు.

కాగా, రామేశ్వరం ప్రాంతానికి చెందిన సుమారు 500 మంది  జాలర్లు మర పడవల్లో శనివారం వేకువజామున  సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఆదివారం వేకువజామున భారత్, శ్రీలంక దేశాల సముద్ర జలాల సరిహద్దులో ఉన్న కచ్చాతీవు సమీపం వద్ద సుమారు జాలర్లు చేపలు పడుతుండగా, 20 గస్తీ పడవల్లో వచ్చిన శ్రీలంక నావికాదళం సిబ్బంది వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

Omicron variant: క‌ల‌వ‌ర‌పెడుతున్న ఒమిక్రాన్‌.. కొత్త‌గా మ‌రో 8 కేసులు.. మొత్తం 153

తమ దేశపు సముద్రజలాల్లో అక్రమంగా చొరబడి చేపలు పడుతున్నారంటూ దాడికి దిగారు. ఈ ఘటనను చూసిన మిగతా జాలర్లంతా భయంతో స్వస్థలానికి తిరుగుముఖం పట్టారు. ఆదివారం ఉదయం రామేశ్వరం తీరం చేరుకున్న జాలర్లు శ్రీలంక నావికాదళం దాష్టీకం గురించి తెలపడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్