
ఢిల్లీ : ఒక న్యాయవాదిని లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలోని Rohini District Courtలో బాంబు పెట్టిన డీఆర్ డీవో సీనియర్ Scientist భరత్ భూషన్ కటారియా జైల్లో ఆత్మహత్యకు యత్నించాడు. Hand washను తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని పోలీసులు ఎయిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
రోహిణీ కోర్టులో టిఫిన్ బాక్సు బాంబు పెట్టిన కేసులో భరత్ ను గత శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, శనివారం రాత్రి వాష్ రూంకు వెళ్లిన భరత్.. అపస్మారక స్థితిలో పడిపోయాడు. పోలీసులు ఏమైందని ప్రశ్నించగా.. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పాడు.
దీంతో పోలీసులు వెంటనే అతడిని Baba Saheb Ambedkar ఆసపత్రికి తరలించగా.. AIMs కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఎయిమ్స్ లో చేర్పించి చికిత్స అందించారు. అతడు లిక్విడ్ హ్యాండ్ వాష్ ను సేవించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత విచారణ కొనసాగించనున్నట్లు చెప్పారు.
ఈ నెల 9వ తేదీన రోహిణీ కోర్టులో Bomb blast కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. న్యాయవాదిలో ఉన్న పాత కక్షల కారణంగా భరత్ ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్ మెంటులో భరత్ నివాసముంటున్నారు. ఆయన పొరుగింట్లో ఉండే ఓ Lawyerతో ఈయనకు గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. వీరిద్దరూ పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయవాదిని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో భరత్ ఈ బాంబు పేలుడుకు కుట్రపన్నాడు. ఈ పేలుడు ఘటనలో ఒకరు గాయపడ్డారు.
రోహిణి కోర్టులో పేలుడు కేసులో డీఆర్‌డీవో సైంటిస్టు అరెస్టు.. ‘ఆ లాయర్‌ను చంపాలనుకున్నా..’
ఇదిలా ఉండగా, ఈ నెల 9వ తేదీన రోహిణి జిల్లా కోర్టులో పేలుడు సంభవించింది. ఇందులో లక్షిత న్యాయవాది గాని ఇతరులకు గానీ ప్రాణ హానీ కలుగలేదు. అయితే, కొందరికి గాయాలైనట్టు తెలిసింది. రోహిణి కోర్టులో పేలుడు సంభవించినట్టుగా అగ్నిమాపక శాఖకు ఉదయం 10. 40 గంటలకు సమాచారం అందింది. దీంతో ఏడు అగ్నిమాపక యంత్రాలు కూడా ఘటన స్థలానికి చేరుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో రోహిణి జిల్లా కోర్టు(Rohini District Court)లో పేలుడు(Blast) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇందులో తీవ్రవాదుల కోణం ఏమైనా ఉన్నదా? అనే కోణంలో చర్చలు జరిగాయి. ఏకంగా న్యాయస్థానంలో పేలుడు జరగడం చర్చనీయాంశమైంది. ఈ పేలుడు కేసులో తాజాగా కీలక మలుపు ఎదురైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్త ఒకరి ప్రమేయం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది.
స్వయంగా ఆ DRDO Scientist తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఓ న్యాయవాదిని చంపే లక్ష్యంతో ఆ బాంబును అమర్చినట్టు వివరించారు. ఆయనే స్వయంగా ఆ బాంబును రూపొందించినట్టూ చెప్పడం గమనార్హం. ఓ కేసులో వాదించడానికి రోహిణి జిల్లా కోర్టులో హాజరై ఒక న్యాయవాదిని హతమార్చాలనే లక్ష్యంతో ఓ డీఆర్‌డీవో సైంటిస్టు పథకం పన్నినట్టు దర్యాప్తులో వెలుగుచూసినట్టు సమాచారం. ఆ న్యాయవాదితో ఈ సైంటిస్టుకు ఓ ప్రాపర్టీ విషయమై వ్యక్తిగత వైరం ఉన్నట్టు తెలిసింది.