దక్షిణ కొరియా మొదటి మహిళ అయోధ్య పర్యటన....

By Arun Kumar PFirst Published Nov 6, 2018, 4:36 PM IST
Highlights

ఐదు రోజుల పర్యటనలో భాగంగా గత ఆదివారం ఇండియాకు వచ్చిన దక్షిణ కొరియా మొదటి మహిళ( ఆ దేశ అధ్యక్షుడి మూన్ జాయి ఇన్స్  భార్య) కిమ్ జంగ్ సూక్ ఇవాళ ఉత్తర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. అయోధ్య లో దీపావళి పండగ సందర్భంగా జరిగే దీపోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే ఆమె అయోధ్య పర్యటన వెనుక భారత్-కొరియా దేశాల మధ్య చారిత్రక బంధం దాగివుంది.  

దాదాపు 2000 సంవత్సరాల క్రితం సూరిరత్న అనే అయోధ్య రాకుమారి తండ్రి ఆదేశాలతో కొరియాకు వెళ్లినట్లు ఆ దేశ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. అక్కడి రాజును ఆమె పెళ్లి చేసుకుని కొరియాలోనే ఉండిపోయిందట. ఆమె అందానికి సమ్మోహితుడైన కొరియా  రాజు ప్రత్యేకంగా ఆమెకు ఓ గుడిని కూడా కట్టించినట్లు కొరియా చరిత్ర చెబుతోంది. అయితే ఇలా కొరియాకు వెళ్ళిన భారత ఆడపడుచు జ్ఙాపకార్ధం అయోధ్యలో ప్రతి దీపావళికి ప్రత్యేక ఉత్సవాలు జరుపుతుంటారు. అయితే ఈసారి మాత్రం ఆ ఉత్సవాల్లో కొరియా ప్రెసిడెంట్ భార్య పాల్గొనడం ప్రత్యేక ఆకర్షనగా నిలవనుంది.

ఈ వేడుకలతో పాటు కిమ్ జంగ్ సూక్ మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో కలిసి ఆమె ఓ పాఠశాలలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.   
 
click me!