పీఎన్ బీ స్కామ్.. దీపక్ కులకర్ణి అరెస్ట్

By ramya neerukondaFirst Published Nov 6, 2018, 3:27 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిజానిజాలు బయటపెట్టేందుకు ఈడీ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తుని వేగవంతం చేసింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిజానిజాలు బయటపెట్టేందుకు ఈడీ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు, వ్యాపారవేత్త  మెహుల్ చోక్సీ కి అత్యంత సన్నిహితుడైన దీపక్ కులకర్ణిని ఈడీ అధికారులు  ఈ రోజు కోల్ కత్తాలో అరెస్టు చేశారు. 

కోల్ కత్తా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న అతనిని ఈ రోజు  ఈడీ అధికారులు ముంబయి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మనీల్యాండరింగ్ కేసులో కులకర్ణిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కులకర్ణి హాంకాంగ్ నుంచి ఇండియా వస్తుండగా అరెస్టు చేయడం గమనార్హం. హాంకాంగ్ లో మెహుల్ చోక్సీకి చెందిన సంస్థకు కులకర్ణి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 

click me!