''కోహ్లీసేన గెలుపులాంటిదే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు...రెండిట్లోనూ 4-1 తేడానే''

By Arun Kumar PFirst Published Nov 6, 2018, 3:10 PM IST
Highlights

కర్ణాటకలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇందులో అధికార జేడిఎస్, కాంగ్రెస్ కూటమి భారతీయ జనతా పార్టీపై ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపుతో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. సంకీర్ణ కూటమి విజయంపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనదైన శైలిలో స్పందించారు. 

కర్ణాటకలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇందులో అధికార జేడిఎస్, కాంగ్రెస్ కూటమి భారతీయ జనతా పార్టీపై ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపుతో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. సంకీర్ణ కూటమి విజయంపై మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనదైన శైలిలో స్పందించారు. 

బిజెపిని చిత్తుచేస్తూ మొత్తం ఉపఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో నాలుగింట కాంగ్రెస్, జేడిఎస్ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఇటీవలే టీంఇండియా జట్టు కూడా వెస్టిండిస్‌తో ఐదు వన్డేలలో తలపడింది. ఈ సీరిస్ లో కూడా భారత్ విండీస్ ను 4-1 తేడాతో ఓడించింది. దీంతో కాంగ్రెస్ కూటమి విజయాన్ని టీంఇండియా విజయంతో పోలుస్తూ చిదంబరం తనదైన మాటలతో ట్వీట్ చేశారు. 

'' ఇండియన్ క్రికెట్ టీం విరాట్ కోహ్లీ సారథ్యంలో ఐదు వన్డేల సిరీస్ గెలిచినట్టే కర్ణాటకలో కూడా కాంగ్రెస్,జేడిఎస్ కూటమి 4-1 తేడాతో ఫలితం రాబట్టింది. ఇది కూటమి సాధించిన సమిష్టి విజయం..’’ అంటూ చిదంబరం ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని భిన్నంగా వ్యక్తపర్చారు. అంటే టీంఇండియా మాదిరిగా కర్ణాటకలో తమ కూటమి బలంగా ఉందన్న అభిప్రాయాన్ని ఆయన బైటపెట్టారు.

కర్ణాటక 3 లోక్‌సభ, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 4 స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌లు రాజీనామా చేయడం.. రామనగర అసెంబ్లీ స్థానాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి వదలుకోవడం.. జమఖండి ఎమ్మెల్యే మరణించడంతో ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. గత శనివారం ఈ స్థానాల్లో పోలింగ్ జరిగ్గా,ఇవాల ఓట్లు లెక్కింపు చేపట్టగా అధికార సంకీర్ణ కూటమి బిజెపిపై పైచేయి సాధించింది.

4-1 result (unsure about Shimoga LS) in Karnataka looks like a Test series win under Virat Kohli. Coalition has delivered.

— P. Chidambaram (@PChidambaram_IN)

మరిన్ని వార్తలు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ

కాంగ్రెస్ 14 ఏళ్ల నిరీక్షణ... ‘‘గాలి’’ కోటలో హస్తం పాగా

click me!