దారుణం.. భోజనం విషయంలో గొడవపడి తల్లికి నిప్పంటించిన కొడుకు..

భోజనం విషయంలో తల్లితో గొడవపడిన కొడుకు.. ఆమెకు నిప్పంటించి చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. 

Google News Follow Us

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భోజనం తయారుచేసే విషయంలో26 ఏళ్ల యువకుడు తల్లితో  గొడవపడ్డాడు. ఆ కోపంలో తల్లికి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. ఈ విషయాన్ని పోలీసులు బుధవారం తెలిపారు.

రేవ్‌దండా సమీపంలోని నవ్‌ఖర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. శరీరమంతా తీవ్రమైన కాలిన గాయాలతో ఉన్న మహిళ ఈ ఉదయం అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆయన తెలిపారు. బాధితురాలిని చంగునా నామ్‌డియో ఖోట్‌గా గుర్తించారు.

ఆస్తి వివాదం.. ట్రాక్టర్ తో ముందుకూ, వెనక్కి 8సార్లు తొక్కించి సోదరుడి హత్య...

చంగునా నామ్‌డియో ఖోట్‌ ను భోజనం వడ్డించే విషయంలో గొడవపడి కొడుకు జయేష్ ఆమెను కొట్టాడు. ఆ తరువాత విపరీతమైన కోపంతో, అతను ఆమెను ఇంటి ముందు ఉన్న బహిరంగ ప్రదేశానికి ఈడ్చుకెళ్లాడు. ఎండుకర్రలను సేకరించి నిప్పంటించాడని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రావ్‌దండ పోలీస్‌స్టేషన్‌ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

తల్లికి నిప్పంటించిన తరువాత.. జయేష్ అక్కడినుంచి పారిపోయాడు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసు బృందం సమీపంలోని అడవి నుండి జయేష్‌ను పట్టుకుంది. తదుపరి విచారణ కొనసాగుతోంది.