ఆస్తి వివాదం.. ట్రాక్టర్ తో ముందుకూ, వెనక్కి 8సార్లు తొక్కించి సోదరుడి హత్య...

By SumaBala Bukka  |  First Published Oct 26, 2023, 9:42 AM IST

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో భూమి విషయంలో రెండు కుటుంబాలు ఘర్షణ పడి.. ఒక వ్యక్తిని అతని సోదరుడు ట్రాక్టర్‌తో దారుణంగా తొక్కించి చంపినట్లు పోలీసులు తెలిపారు.


రాజస్థాన్ : ఆస్తి వివాదాలు రక్త సంబంధాల మధ్య చిచ్చు పెట్టడం కొత్త విషయం ఏమీ కాకపోయినాప్పటికీ.. అత్యంత క్రూరంగా హతమార్చడం షాకింగ్ కలిగిస్తుంది. అలాంటి ఒక దారుణమైన ఘటన రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో వెలుగు చూసింది. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో ఓ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్నవివాదం తీవ్ర ఘర్షణగా మారింది. సోదరుడి వరస అయ్యే వ్యక్తిని మరో వ్యక్తి ట్రాక్టర్ తో ఎనిమిది సార్లు అత్యంత కర్కశంగా తొక్కించి చంపారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…

భరత్ పూర్ లోని బయానా ప్రాంతానికి చెందిన బహదూర్ సింగ్ గుర్జర్, అతర్ సింగ్ కుటుంబాలు దాయాదులు. వీరి మధ్య ఓ స్థలానికి సంబంధించిన విషయంలో వివాదం నడుస్తోంది. ఈ గొడవలు ఇలా ఉండగానే బహదూర్ కుటుంబ సభ్యులు బుధవారం నాడు ట్రాక్టర్ తో ఆ స్థలాన్ని దున్నేందుకు వెళ్లారు. ఈ విషయం అతర్ సింగ్ కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటలతో మొదలైన ఘర్షణ భౌతిక దాడికి తెరలేపింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. 

Latest Videos

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: 12మంది మృతి, మృతులంతా సత్యసాయి జిల్లా వాసులే

ట్రాక్టర్ ని ముందుకు పోనిచ్చేది లేదంటూ అతర్ సింగ్ కుటుంబానికి చెందిన నిర్పత్ అనే వ్యక్తి నిరసనగా నేలపై పడుకున్నాడు. అయితే, బహుదూర్ కుటుంబానికి చెందిన వ్యక్తి.. దాన్ని లెక్కచేయకుండా ట్రాక్టర్ తో అతని మీదికి దూసుకొచ్చాడు. అక్కడున్నవారు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా లెక్కపెట్టలేదు. వెనక్కీ, ముందుకు 8సార్లు పడుకున్న వ్యక్తి మీది నుంచి తొక్కించాడు. ఈ ఘటనలో నిర్పత్  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, నిందితుడు, మృతుడు  వరుసకు సోదరులవుతారని తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం  నిందితులైన బహదూర్ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.

click me!