కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బళ్లాపూర్ లో గురురవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్ లో గురువారంనాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాకు చెందినవారు.ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందినవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలానికి చెందినవారుగా గుర్తించారు.ప్రమాదం జరిగిన సమయంలో టాటా సుమోలో 14 మంది ప్రయాణం చేస్తున్నారు.
undefined
ప్రతి రోజూ గోరంట్ల నుండి బెంగుళూరుకు ప్రైవేట్ వాహనాల్లో స్థానికులు వెళ్తుంటారు. బెంగుళూరు నుండి గోరంట్లకు తిరిగి వస్తుంటారు.గోరంట్ల నుండి బెంగుళూరుకు వలస కూలీలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని సుమో ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి వందలాది మంది కూలీలు ఉపాధి కోసం బెంగుళూరుకు ప్రతి రోజూ వలస వెళ్తుంటారు. ఇవాళ కూడ ఉపాధి కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు రోడ్లు సరిగా లేకపోవడం వంటి కారణాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.