
కోల్‌కతా : బెంగాల్ లో ఓ హేయమైన ఘటనలో నిందితుడికి జీవితఖైదు పడింది. మత్తులో జోగుతూ.. కన్నూమిన్నూ కానకుండా.. కన్నతల్లిమీద అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడైన కొడుకు. కొడుకు చేసిన పనికి కుమిలిపోతూ.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక..సమాజానికి భయపడి ఆమె మౌనంగా ఉండిపోయింది. దీంతో రెచ్చిపోయిన ఆ కీచకుడు మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది.
హరిదేవ్‌పూర్‌కు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి నాలుగేళ్ల క్రితం తన సొంత తల్లిపై రెండుసార్లు అత్యాచారం చేసిన కేసులో ఇటీవల సిటీ కోర్టు జీవిత ఖైదు విధించింది. తీవ్రమైన మాదకద్రవ్యాలకు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు 2019 కి ముందు ఏడుసార్లు మాదకద్రవ్యాల పునరావాస కేంద్రాలలో చేరాడు.
కార్టూన్లు చూస్తూ టీవీ సెట్ టాప్ బాక్స్ ను తాకిన 4 ఏళ్ల బాలుడు.. కరెంట్ షాక్ రావడంతో మృతి
బాధితురాలి వయసు 65 సంవత్సరాలు. 2019 మే 5న హరిదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ లో తనపై కొడుకు చేసిన దాష్టీకాన్ని ఫిర్యాదు చేసింది. తన పెద్ద కొడుకు వివాహం అయ్యి, అతని భార్యతో వేరు కాపురం పెట్టడంతో చిన్న కొడుకుతో కలిసి తాను ఒంటరిగా తన చిన్న కొడుకుతో ఉంటున్నానని బాధితురాలు తెలిపింది.
ఏప్రిల్ 14న తన కొడుకు తనపై మొదటిసారి అత్యాచారం చేశాడని.. దీంతో షాక్ అయిన తాను..నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని..సమాజానికి భయపడి.. మౌనంగా ఉండిపోయానని ఆమె పేర్కొంది. ఇది అలుసుగా తీసుకున్న కొడుకు మళ్లీ మే 5న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈసారి మరింత హింసాత్మకంగా దాడి చేశాడు. దీంతో భరించలేకపోయిన తల్లి పోలీసులను ఆశ్రయించింది.
ఆమె పిర్యాదు మేరకు పోలీసులు వెంటనే.. నిందితుడిని అరెస్టు చేశారు. ఏడున్నర నెలల పాటు జైలులో ఉంచారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు. ఆ నివేదిక, బాధితురాలి వాంగ్మూలం, ఆమె పెద్ద కుమారుడు, సంఘటన సమయంలో ఆమె ఇంటికింద నివసిస్తున్న ఇద్దరు అద్దెదారులు, ఇద్దరు వైద్యులు, ఆమెను పరీక్షించిన ఒకరు.. మరో వ్యక్తి సహా ఏడుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.వీటి ఆధారంగా నిందితుడైన కామాంధుడికి జీవిత ఖైదు విధించబడింది. 50,000 జరిమానా కూడా విధించారు.