కార్టూన్లు చూస్తూ టీవీ సెట్ టాప్ బాక్స్ ను తాకిన 4 ఏళ్ల బాలుడు.. కరెంట్ షాక్ రావడంతో మృతి

Published : Aug 10, 2023, 06:45 AM IST
కార్టూన్లు చూస్తూ టీవీ సెట్ టాప్ బాక్స్ ను తాకిన 4 ఏళ్ల బాలుడు.. కరెంట్ షాక్ రావడంతో మృతి

సారాంశం

టీవీ సెట్ టాప్ బాక్స్ ను తాకి, కరెంట్ షాక్ రావడంతో ఓ బాలుడు మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆ బాలుడికి నాలుగేళ్లు. ఇంట్లో ఎప్పుడు చలాకీగా తిరుగుతుంటాడు. నాలుగేళ్ల కావడంతో ఇంకా స్కూల్ కు వెళ్లడం లేదు. ఇంట్లోనే తల్లిదండ్రులు సంరక్షణలో పెరుగుతున్నాడు. ఈ క్రమంలో పిల్లాడు ఎప్పటిలాగే ఇంట్లో టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు. అయితే ఆడుకుంటూ వెళ్లి టీవీ సెట్ టాప్ బాక్స్ ను టచ్ చేశాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లా హింగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైరే పన్నసే ప్రాంతంలో ఇద్దరు దంపతులు తమ నాలుగేళ్ల పిల్లాడితో జీవిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తల్లి కుమారుడికి టీవీలో కార్టూన్లు పెట్టించి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. తండ్రి కూడా ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఓ గదిలో నిద్రపోతున్నాడు. 

అయితే బాలుడు కార్టూన్లు చూస్తూ, ఆడుకుంటూ వెళ్లి టీవీ సెట్ ఆప్ బాక్సును తాకాడు. దీంతో బాలుడికి ఒక్క సారిగా కరెంట్ షాక్ తగిలింది. కొంత సమయం పాటు అలాగే అల్లాడిపోయాడు. అనంతరం కిందపడిపోయాడు. దీంతో ఒక్క సారిగా తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే బాలుడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

వెంటనే బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ ఆ బాలుడు అప్పటికే మరణించాడని డాక్టర్లు నిర్దారించారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తు మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu