Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. యూపీ డిప్యూటీ సీఎం కుమారుడికి తృటిలో తప్పిన ముప్పు

Published : Mar 27, 2022, 02:48 AM IST
Uttar Pradesh:  ఘోర రోడ్డు ప్రమాదం.. యూపీ డిప్యూటీ సీఎం కుమారుడికి తృటిలో తప్పిన ముప్పు

సారాంశం

Uttar Pradesh:   ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కుమారుడు యోగేష్ కుమార్ మౌర్య కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. రాష్ట్రంలోని  జలౌన్ జిల్లాలో ఈ ప్రమాదం జ‌రిగింది. అయితే..  అతనికి ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని, అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.  

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కుమారుడు యోగేష్ కుమార్ మౌర్య కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  యూపీ లోని జలౌన్ జిల్లాలో ప్రమాదం జ‌రిగింది. అయితే..  అతనికి ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని, అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. యోగేష్ మౌర్య ఆరోగ్య పరిస్థితిని  ఉప ముఖ్యమంత్రి.. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. అతన్ని రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోను షేర్ చేశాడు. 

 "పీతాంబర దేవి దయ, అందరి ఆశీర్వాదంతో.. నా కుమారుడు యోగేష్ కుమార్ మౌర్య పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. వైద్యులను సంప్రదించిన తర్వాత, మా ప్రార్థనలు చేసి, ఆశీర్వాదం కోసం మేము మళ్లీ పీతాంబర ఆలయానికి బయలుదేరాము" అని కేశవ్ ప్రసాద్ మౌర్య ట్వీట్ చేశారు.

 జలౌన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యోగేష్ కుమార్ మౌర్య ప్ర‌యాణిస్తున్న కారు శ‌నివారం మ‌ధ్యాహ్నం రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. జ‌లౌన్ జిల్లా ఆలంపూర్ బైపాస్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. యోగేష్ మౌర్య ప్ర‌యాణిస్తున్న కారు వేగంగా దూసుకెళ్లి ఓ ట్రాక్ట‌ర్‌ను ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి.  

ప్రమాదానికి గురైన వెంటనే పోలీసులు స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘ‌ట‌నలో యోగేష్ మౌర్య, అతనితోపాటుకారులో ప్రయాణిస్తోన్నవారికి పెద్ద గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు వెల్ల‌డికావాల్సి ఉంది. యూపీలో సీఎం యోగి తర్వాతత నంబర్ 2గా భావించే కేశవ్ ప్రసాద్ మౌర్య కుటుంబానికి ఇలా జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది..యూపీ డిప్యూటీ సీఎంగా కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య శుక్ర‌వారం ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu