
Amit Shah: కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ లోయలో అఘాయిత్యాలు, ఉగ్రదాడులు ఎలా చోటు చేసుకున్నాయో తెలుసుకోవాలంటే ప్రజలు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అనే చిత్రం చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో కశ్మీర్‌లో అరాచకాలు, ఉగ్రదాడులు ఎలా చోటు చేసుకున్నాయో తెలుసుకోవాలంటే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడని వారు తప్పక చూడాల్సిందే' అని, బీజేపీ మద్దతు ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం హయాంలో జరిగిన సంఘటనలను చూపించే సినిమా అని అన్నారు.
నరేంద్ర మోడీని రెండవసారి ప్రధానమంత్రిని చేసినప్పుడు.. చాలా వివాదాస్పదమైన, సున్నితమైన ఆర్టికల్ 370ని తొలగించాడనీ, అలాంటి ధృఢమైన సంకల్ప శక్తి కొంత మందికి మాత్రమే ఉంటుందని, నరేంద్ర మోడీకి కూడా అలాంటి శక్తి ఉందని అన్నారు.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన "ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో 1990వ దశకం ప్రారంభంలో పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు సంస్థలు మన దేశంలోకి చోరబడి కాశ్మీరీ పండిట్‌ల సొంత రాష్ఠ్రమైన కాశ్మీర్ నుంచి బలవంతంగా పంపించారు. కాశ్మీర్ పండిట్ల విషాదాన్ని సినిమాలో చిత్రీకరించిన విధానం గురించి చర్చకు దారితీసింది, కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇచ్చాయి.
అంతకుముందు రోజు గాంధీనగర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. భారతదేశాన్ని "సురక్షితమైన, సంపన్నమైన శక్తివంతం" చేయడానికి ప్రధాని మోడీ చేపట్టిన విధానాల వల్లే.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి "భారీ" విజయం సాధించిందనీ, నాలుగు రాష్ట్రాల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఘోర అపరాజయం పాలైందనీ, ఇప్పటికే దేశ ప్రజలకు అర్థమైందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగింపు దశలో ఉందనీ, దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ కనిపించడం లేదని, నరేంద్ర మోడీ నాయకత్వంపై భారత ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఉందనీ.. ఆ నమ్మకానికి ప్రతి బింబమే ఈ భారీ విజయమని అన్నారు. ఇదిలా ఉంటే.. కేంద్ర మంత్రి తన లోక్‌సభ నియోజకవర్గం గాంధీనగర్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ₹ 367 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
కశ్మీరీ పండితుల వలస ఆధారంగా బాలీవుడ్ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించ చిత్రం 'కశ్మీర్ ఫైల్స్ . ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకూ రూ. 200 కోట్లకు పైగా ఆర్జించింది. అయితే.. ఈ చిత్రానికి బీజేపీ సపోర్టు చేస్తూ.. ప్రమోట్ చేయడంతో రాజకీయ రంగు పూలుముకుంది. దీంతో విపక్షలు, బీజేపేతర పార్టీలు ఈ చిత్రాన్ని తిరస్కరిస్తున్నారు.
మరోవైపు.. ఢిల్లీ సీఎం ఈ సినిమాను ఉద్దేశించి.. మాట్లాడారు. కశ్మీర్ ఫైల్స్' సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని కాశ్మీరీ పండిట్‌ల వాపసు కోసం ఉపయోగించాలని కేజ్రీవాల్ సూచించారు. కశ్మీర్ అంశాన్ని బీజేపీ రాజకీయం కోసం, ధనార్జన కోసమే వాడుకుంటోందని విమర్శించారు. గత 25 ఏళ్లలో కాశ్మీరీ పండిట్ల వలస తర్వాత బీజేపీ 13 ఏళ్లు అధికారంలో ఉంది. వరుసగా గత ఎనిమిదేళ్ల నుంచి దేశాన్ని పాలిస్తోంది. అయినా, కశ్మీర్ పండిట్లు ఎవరూ తిరిగి కాశ్మీర్ వెళ్లలేకపోయారని విమర్శించారు.