Mumbai: ముంబయిలో విషాద ఘటన… ఇల్లు కూలి నాలుగేళ్ల బాలుడు మృతి

Published : Mar 26, 2022, 11:49 PM IST
Mumbai: ముంబయిలో విషాద ఘటన… ఇల్లు కూలి నాలుగేళ్ల బాలుడు మృతి

సారాంశం

Mumbai: మ‌హారాష్ట్ర‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ముంబ‌యి పట్టణంలో ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ఘ‌ట‌న‌లో నాలుగేళ్ల బాలుడు మృతి, ఇద్దరికి తీవ్ర‌ గాయాలయ్యాయి.  

Mumbai:  మ‌హారాష్ట్ర‌లోని ముంబాయిలో విషాదం చోటుచేసుకుంది. ముంబ‌యి పట్టణంలో ఆక‌స్మాతుగా..ఓ  ఇల్లు కుప్పకూలింది. ఈ ఘ‌ట‌న‌లో నాలుగేళ్ల బాలుడు మృతి, ఇద్దరికి తీవ్ర‌ గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, గ్రౌండ్ ప్లస్ వన్ అంతస్థుల ఇల్లు కూలిపోవడానికి ఇదే కారణమని అధికారులు తెలిపారు. దీంతో రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి వెళ్లాయి. సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. స్థానిక అధికారులు, పోలీసులు అక్కడి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
 
ఈ ఘ‌ట‌న‌లో  ఇద్దరు మహిళలు గాయపడ్డారు, నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. లాల్జీ పడా ప్రాంతంలోని కెడి కాంపౌండ్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇద్దరినీ శతాబ్ది ఆసుపత్రిలో చేర్చారు.ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న‌ట్టు  BMC అధికారి తెలిపారు.  ఆ ప్రాంతంలో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, గ్రౌండ్ ప్లస్ వన్ అంతస్థుల ఇల్లు కూలిపోవడానికి ఇదే కారణమని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

మృతి చెందిన బాలుడిని నౌషాద్ అలీ (4) గా గుర్తించారు. అతని కుటుంబంలోని ఇద్దరు సభ్యులు హసీనా షాహా (22), షాహిదున్నీసా (30) తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు మహిళలను చికిత్స కోసం శతాబ్ది ఆసుపత్రిలో చేర్చినట్లు BMC అధికారి తెలిపారు. మ‌రిన్ని వివారాలు తెలియాల్సింది. 

కాగా కొన్ని రోజుల క్రితం.. ముంబ‌యిలోని బాంద్రా ఏరియాలోని బెహ్రామ్ నగర్‌లో  ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని బాంద్రా ఏరియాలోని బెహ్రామ్ నగర్‌లో ఓ భవనం కుప్పకూలింది. ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. భవన కూలడంతో ఆ శిథిలాల కింద ఐదుగురు చిక్కుకుపోయారు. భవనం కూలిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu