యాక్సిడెంట్ లో కుమారుడు మృతి.. ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు విచిత్ర పూజలు..

Published : Jun 22, 2023, 09:37 AM IST
యాక్సిడెంట్ లో కుమారుడు మృతి.. ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు విచిత్ర పూజలు..

సారాంశం

చనిపోయిన కుమారుడి ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు విచిత్ర పూజలు నిర్వహించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. చెరువుగట్టు వద్ద మేళ తాళాల మధ్య ఈ పూజలు చేశారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. 

యాక్సిడెంట్ లో రెండు నెలల కిందట ఓ యువకుడు చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అతడి ఆత్మ దహన సంస్కారాలు చేసిన ప్రాంతంలోనే తిరుగుతోందని ఆ కుటుంబ సభ్యులు భావించారు. ఆ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు విచిత్రమైన పూజలు జరిపించారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

మోడీ భారతీయ సంస్కృతికి ప్రతీక - భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ప్రశంసలు

వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా సొరకాల్‌నత్తం గ్రామంలో కేశవన్‌, వాసంతి భార్యాభర్తలు. వీరికి ఎయిల్‌ అరసన్‌, 20 ఏళ్ల ఉదయ్‌వసంత్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో ఎయిల్ అరసన్ ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తున్నాడు. కాగా.. ఇంకో కుమారుడు ఉదయ్‌వసంత్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన బైక్ పై వెళ్తున్న సమయంలో లారీ ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. 

ప్రధాని మోడీ కోసం స్టేట్ డిన్నర్ లో క్యూరేటెడ్ మెనూ.. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రథమ మహిళ.. (వీడియో)

దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కలత చెందారు. డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గ్రామస్తులు, బంధువులు అంతా కలిసి ఆదే గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే దహన సంస్కారాల అనంతరం కుమారుడి ఆత్మ ఊరిలోని చెరువు గట్ల వద్ద తిరుగుతున్నట్టు తల్లిదండ్రులు భావించారు. అందుకే ఆ ఆత్మను ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. 

దీని కోసం అవసరమైన పూజను మంగళవారం చేయాలని భావించారు. సాయంత్రం సమయంలో చెరువు గట్టు దగ్గరికి వెళ్లి విచిత్ర పూజలు చేయడం మొదలుపెట్టారు. నేలపై పసుపు పోసి, పూవ్వులు పెట్టి, మేళ తాళాలు మోగిస్తూ పూజ చేశారు. తరువాత ఉదయ్ వసంత్ ఫొటో ను, కరగను చెరువు దగ్గర నుంచి మేళ తాళాల చప్పుల మధ్య ఊరేగింపుగా ఇంటికి తీసుకొని వచ్చారు. 

నడిరోడ్డు మీద ప్రభుత్వ అధికారి చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే, వీడియో వైరల్

ఇంట్లో కూడా ఉదయ్‌వసంత్‌ ఫొటో పెట్టి, పూలమాలలు వేశారు. ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఇలా కుమారుడి ఆత్మ కోసం పూజలు చేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశం అయ్యింది. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?