లాక్‌డౌన్ ఎఫెక్ట్: 16 ఏళ్ల తర్వాత తల్లి వద్దకు చేరుకొన్న కొడుకు

By narsimha lode  |  First Published Apr 20, 2020, 12:05 PM IST

లాక్‌డౌన్ ఓ తల్లి, కొడుకును కలిపాయి. 16 ఏళ్ల క్రితం ఇళ్లు విడిచిపోయి వెళ్లిన కొడుకు లాక్ డౌన్ సమయంలో ఇంటికి రావడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఇతర ప్రాంతం నుండి స్వంత గ్రామానికి వచ్చిన అతడిని క్వారంటైన్ కి తరలించారు.  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.



చెన్నై:లాక్‌డౌన్ ఓ తల్లి, కొడుకును కలిపాయి. 16 ఏళ్ల క్రితం ఇళ్లు విడిచిపోయి వెళ్లిన కొడుకు లాక్ డౌన్ సమయంలో ఇంటికి రావడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఇతర ప్రాంతం నుండి స్వంత గ్రామానికి వచ్చిన అతడిని క్వారంటైన్ కి తరలించారు.  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలోని సాంత్తూరు పట్టణంలోని నందవనపట్టి వీధిలో లక్ష్మి నివసిస్తోంది. ఆమె పోషకాహార నిపుణురాలిగా పనిచేస్తోంది.ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఐదుగురు కొడుకులు.

Latest Videos

అయితే ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పోషణ కోసం పిల్లల్ని ఆమె పనికి పంపించింది. ఆర్ధిక సమస్యల కారణంగా స్కూల్ కు గుడ్ బై చెప్పి పనికి వెళ్లేవాడు పాండిరాజన్. అయితే అతనికి సినిమాల్లో నటించడం అంటే ఆసక్తి. దీంతో ఆయన తల్లికి చెప్పకుండా చెన్నైకి వెళ్లిపోయాడు.

also read:కరోనా ఎఫెక్ట్: పరప్పర అగ్రహర జైలులో శశికళ జాగ్రత్తలు

నటుడిగా అనేక ప్రయత్నాలు చేశాడు పాండిరాజన్. కానీ ఆయనకు సినిమాల్లో అవకాశం దక్కలేదు.  దీంతో జీవనోపాధి కోసం ఆయన పాత పేపర్ల దుకాణంలో పనికి కుదిరాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేంద్రం లాక్ డౌన్ విధించడంతో  ఆయనకు పని లేకుండా పోయింది. దీంతో తన తల్లిని చూడాలని ఆయన భావించాడు.

లాక్ డౌన్ కారణంగా ఇంటికి వెళ్లేందుకు వాహనాలు కూడ లేవు. దీంతో ఆయన పాండిరాజన్ చెన్నై నుండి సాంత్తూరుకు కాలినడకన చేరుకొన్నారు. ఈ నెల 11వ తేదీన చెన్నై నుండి సాంత్తూరుకు చేరుకొన్నాడు. 16 ఏళ్ల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయిన పాండిరాజన్ ఇంటికి చేరుకోవడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. 

చెన్నై నుండి వచ్చిన పాండిరాజన్ ను కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అతడికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా వచ్చింది.

click me!