కరోనా ఎఫెక్ట్: పరప్పర అగ్రహర జైలులో శశికళ జాగ్రత్తలు

Published : Apr 20, 2020, 11:34 AM IST
కరోనా ఎఫెక్ట్: పరప్పర అగ్రహర  జైలులో శశికళ జాగ్రత్తలు

సారాంశం

దివంగత తమిళనాడు సీఎం జయలలిత సన్నిహితురాలిగా పేరొందిన  శశికళ పరప్ఫర అగ్రహార జైలులో కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా సమాచారం.  

బెంగుళూరు: దివంగత తమిళనాడు సీఎం జయలలిత సన్నిహితురాలిగా పేరొందిన  శశికళ పరప్ఫర అగ్రహార జైలులో కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా సమాచారం.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను  దేశంలోని అన్ని జైళ్లలో కూడ పలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. జైలులో ఉన్న శశికళ మాస్క్ లు ధరించడంతో పాటు ఇతర ఖైదీలతో భౌతిక దూరం పాటిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను జైళ్లలో ఉన్న ఖైదీలకు జైళ్ల శాఖ బెయిల్, పెరోల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

బెంగుళూరు పరప్పర జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ, ఇలవరసి, సుధాకరన్ లకు పెరోల్ లభించినా కూడ వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. బయట కంటే జైల్లో ఉండేందుకు వారు ఇష్టపడ్డారు.

also read:పులిదాడిలో గాయపడిన భార్యను భుజాలపై మోసుకెళ్లిన భర్త: వాహనాలు లేక మృతి

పెరోల్ ప్రయత్నాలను అమ్మ మక్కల్ మన్నేట్ర కళగం వర్గాలు చేపట్టినా వారు తిరస్కరించినట్టుగా ప్రచారం సాగింది. ఈ జైలు నుండి 1,112 మంది ఖైదీలకు తాత్కాలిక బెయిల్ , పెరోల్ లభించింది. దీంతో జైలులో చాలా గదులు ఖాళీగా కన్పిస్తున్నాయి,. శశికళ, ఇలవరసి, సుధాకరన్ లు జైలులో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా సమాచారం.

గతంలో చిన్నమ్మ ఉన్న గదిలో ఆమెతో పాటు మరో ఇద్దరు కూడ ఉండేవారు. పెరోల్, బెయిల్ ఇవ్వడంతో ఆమె గదిలో ఉన్న మరో ఇద్దరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో శశికళ ఒక్కతే ఈ గదిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?