
యూపీ కన్నౌజ్ జిల్లాలోని రసూలాబాద్ ప్రాంతంలో కొన్ని అల్లరి మూకలు అశాంతి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించాయి. కొందరు వ్యక్తులు హిందూ ఆలయంలోకి మాంసం ముక్కలు విసిరారు. ఉదయం పూట దీనిని గుర్తించిన స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. స్థానికంగా ఉన్న పలు దుకాణాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి.. పందులను చంపేస్తున్న అధికారులు !
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని తాలగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూలాబాద్ గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఆవు మాంసం ముక్కలు విసిరారు. గుడి తలుపులు తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ పూజరి జగదీష్ జాతవ్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆయన అక్కడ మాంసం ముక్కలు పడి ఉండటం గమనించాడు. అనంతరం ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేశారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే లోకల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు అధికారులు హడావిడిగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని మాంసం ముక్కలను తొలగించి ఆవరణను శుభ్రం చేశారు. అయితే ఈ ఘటనపై స్థానిక హిందూ సంస్థల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ఉన్న మూడు మాంసం దుకాణాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అనంతరం తల్గ్రామ్-ఇందర్‌ఘర్ రహదారిని దిగ్బంధించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు బృందాన్ని రంగంలోకి దించామని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.