కొందరు సుప్రీంకోర్టు కంటే బీబీసీయే ఎక్కువని భావిస్తారు - ప్రతిపక్షాలపై కిరెన్ రిజిజు ఆగ్రహం

By team teluguFirst Published Jan 22, 2023, 3:39 PM IST
Highlights

కొందరు భారత సుప్రీంకోర్టు కంటే బీబీసీయే ఎక్కువ అని భావిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. బీబీసీ రూపొందించిన ‘‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’’ డాక్యుమెంటరీకి మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీకి మద్దతు ఇచ్చినందుకు ప్రతిపక్షాలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆదివారం విరుచుకుపడ్డారు. భారతదేశంలోని కొంతమంది వ్యక్తులు బీబీసీని సుప్రీంకోర్టు కంటే ఎక్కువని భావిస్తారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేధికగా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

5 స్టార్ హోటల్‌కు రూ. 23 లక్షల కుచ్చుటోపీ.. మూడున్నర నెలలు విలాసంగా గడిపి.. విలువైన వస్తువులతో పరార్

దేశం లోపల, వెలుపల జరుగుతున్న దుష్ప్రచారాల ద్వారా భారత్ ప్రతిష్ఠను దిగజార్చలేమని రిజిజు పేర్కొన్నారు. ‘‘ మైనారిటీలు, లేదా ఆ మాటకొస్తే భారతదేశంలోని ప్రతి సామాజిక వర్గం సానుకూలంగా ముందుకు వెళ్తోంది. భారతదేశం లోపల లేదా వెలుపల ప్రారంభించిన దురుద్దేశపూరిత ప్రచారాలతో భారతదేశ ప్రతిష్ఠను దిగజార్చలేము. ప్రధాని నరేంద్ర మోడీ గొంతు 140 కోట్ల మంది భారతీయుల గొంతుక’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

वैसे भी इन टुकड़े-टुकड़े गिरोह के सदस्यों से कोई बेहतर उम्मीद नहीं है, जिनका एकमात्र लक्ष्य भारत की ताकत को कमजोर करना है।

— Kiren Rijiju (@KirenRijiju)

‘‘ భారత్ లో కొందరు ఇప్పటికీ వలసవాద మత్తు నుంచి తేరుకోలేదు. వారు బీబీసీని భారత సుప్రీం కోర్టు కంటే ఎక్కువగా భావిస్తారు. వారి నైతిక యజమానులను ప్రసన్నం చేసుకోవడానికి దేశ గౌరవాన్ని, ప్రతిష్ఠను ఎంతవరకైనా తగ్గిస్తారు. ఏదేమైనా భారత్ బలాన్ని బలహీనపరచడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న ఈ తుక్డే తుక్డే గ్యాంగ్ సభ్యుల నుంచి ఇంతక కంటే ఎక్కువగా ఏం ఆశించగలం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఘోరం.. 70 ఏళ్ల వృద్ధుడిని ఢీకొట్టి 8 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. బాధితుడు మృతి..

బీబీసీ రూపొందించిన ‘‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’’ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేతలు అభద్రతాభావంతో ఉన్నారు’’ అని అన్నారు. ‘‘ భారత్ లో ఎవరూ బీబీసీ షో చూడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన చక్రవర్తి, ఆస్థానాధికారులు ఇంత అభద్రతాభావంతో ఉండటం సిగ్గుచేటు’’ అని పేర్కొన్నారు.

అమ్మాయి వద్దంటే వద్దనే అర్థం.. వారి అనుమతి లేకుండా తాకకూడదని అబ్బాయిలకు నేర్పండి: కేరళ హైకోర్టు

రెండు భాగాలగా ఉన్న బీబీసీ డాక్యుమెంటరీలో 2002 గుజరాత్‌లో ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించినట్లు తెలిసింది. అయితే బీబీసీ డాక్యుమెంటరీని ఆబ్జెక్టివ్ నెస్ లేని, వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబించే ‘ప్రచార వ్యాసం’గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. అయితే ఈ డాక్యూమెంటరీ ఇండియాలో టెలీకాస్ట్ కాలేదు. 
 

click me!