
సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని దొంగతనం నేరం కింద కట్టేసి.. కొట్టడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జహీరాబాద్ శివారులోని ఓ వెంచర్లో మహేష్ అనే వ్యక్తిని కట్టేసి, కొట్టి చంపారు. ఇక్కడ ఉన్న కాలనీలో బాగారెడ్డిపల్లికి చెందినమహేష్ (32) అనే వ్యక్తి ఒంటరిగా ఉంటున్నాడు.
అతను ఉండేది ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఓ ఇంట్లో నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలో ఉన్న ఇనుపరాడ్లు దొంగతనానికి గురయ్యాయి. దీంతో దాని యజమాని ఆయన ఇనుప రాడ్లను మహేష్ దొంగిలించాడంటూ అతడిని నిలదీశాడు. ఆ తర్వాత అతడిని బలవంతంగా లాక్కెళ్ళి తన వెంచర్లోని స్తంభానికి కట్టేశాడు. దొంగతనం ఎందుకు చేసావు అంటూ తీవ్రంగా కొట్టాడు.
గద్వాల జిల్లాలో దారుణం.. గాయాలకు కుట్లకు బదులు ఫెవీక్విక్ తో అతుకులు.. !
ఆ దెబ్బలకు తట్టుకోలేక మహేష్ మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులకు యజమాని సమాచారం ఇచ్చాడు. వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మహేష్ అప్పటికే మృతి చెందినట్లు తేలింది. వెంటనే వారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం జరగగా రాత్రి వరకు కూడా మృతుడి వైపు నుంచి ఎవరు ఫిర్యాదు చేయడానికి రాలేదు. దీంతో మృతుడు ఎవరో తెలియరాలేదని.. శనివారం నాడు మిగతా విచారణ చేసి కేసు నమోదు చేస్తామని జహీరాబాద్ రూరల్ ఎస్సై పరమేష్ పేర్కొన్నారు.