రాసలీలల సీడీ కేసు : జార్కిహోళీ నన్ను చంపొచ్చు.. హైకోర్టుకు యువతి లేఖ...

By AN TeluguFirst Published Mar 30, 2021, 10:41 AM IST
Highlights

కర్ణాటకలో మాజీ మంత్రి రమేష్ జార్కీ హోళి రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి సస్పెన్స్ కొనసాగిస్తోంది. సోమవారం బెంగళూరు కోర్టులో లొంగిపోతుందని ఆదివారం ఆమె న్యాయవాది జగదీష్ ప్రకటన చేశారు. అయితే అది ఉత్తుత్తిదే అని తేలిపోయింది. రమేశ్‌ జార్కిహొళి మీద పలు ఆరోపణలు చేస్తూ తాజాగా యువతి కర్ణాటక హైకోర్టు సీజేకు రాసిన లేఖను ఆయన సోమవారం విడుదల చేశారు. 

కర్ణాటకలో మాజీ మంత్రి రమేష్ జార్కీ హోళి రాసలీలల సీడీ కేసులో బాధిత యువతి సస్పెన్స్ కొనసాగిస్తోంది. సోమవారం బెంగళూరు కోర్టులో లొంగిపోతుందని ఆదివారం ఆమె న్యాయవాది జగదీష్ ప్రకటన చేశారు. అయితే అది ఉత్తుత్తిదే అని తేలిపోయింది. రమేశ్‌ జార్కిహొళి మీద పలు ఆరోపణలు చేస్తూ తాజాగా యువతి కర్ణాటక హైకోర్టు సీజేకు రాసిన లేఖను ఆయన సోమవారం విడుదల చేశారు. 

ఇంతకీ ఈ లేఖలో ఏం ఉందంటే.. ‘రమేశ్‌ జార్కిహొళి ప్రమాదకరమైన వ్యక్తి. సామాన్యలను బెదిరించడమే ఆయన పని. నాకు, నా కుటుంబానికి రక్షణ కావాలి. సిట్ తో దర్యాప్తు చేయించాలి. రమేశ్‌ జార్కిహొళిపై అత్యాచారం, బెదిరింపులు, మోసం సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ అరెస్టు చేయలేదు. నాకు అన్యాయమే జరిగింది. మీరు (హైకోర్టు సీజే) నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా.. జార్కిహోళి ఏ సమయంలోనైనా నన్ను చంపేస్తాడు’ అని లేఖలో యువతి ఆరోపించింది. 

సిట్ అధికారులపై నాకు నమ్మకం లేదు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా, జార్కిహోళి ఓ క్రిమినల్. ఆలస్యమైతే సాక్ష్యాలను తారుమారు చేస్తారని భయంగా ఉంది. నాకు బహిరంగ వార్నింగ్ లు ఇచ్చారు. అందుకే విచారణకు హాజరయ్యేందుకు భయపడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా జార్కిహోళికి అనుకూలంగా ఉంది. సాక్ష్యాలను తుడిచి పెట్టేందుకు నన్ను హత్య చేయించే అవకాశం లేకపోలేదు’ అని ఆరోపించింది. 

మరోవైపు ఆమె హై కోర్టులో హాజరు కావడానికి వచ్చిందని న్యాయవాది జగదీశ్ తెలిపారు. ఇదిలా ఉండగా రమేశ్‌ జార్కిహొళి సోమవారం సిట్‌ విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణకు హాజరు కావడం ఇది మూడోసారి. సుమారు 4 గంటల పాటు సాగిన విచారణలో ఆ యువతితో తనకు సంబంధమే లేదని చెప్పినట్లు తెలిసింది. జార్కిహోళి తన తరఫు న్యాయవాదులతో మాట్లాడిన తరువాత, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని దీనికోసం నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. 

ఇంకోవైపు సీడీలో ఉన్నట్లు భావిస్తున్న యువతికి సిట్‌ పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు పంపించారు. మంగళవారం బెంగళూరులో కబ్బన్ పార్క్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అయితే పోలీసులు ఇప్పటివరకు ఆ యువతికి 8 సార్లు నోటీసులు పంపించినా, ఆమె ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. 

తమ కూతురు ఒత్తడిలో ఉందని, ప్రభుత్వంపై ఆమె చేస్తున్న ఆరోపణలను పట్టించుకోరాడని యువతి తల్లిదండ్రులు అన్నారు. ఆమెకు మానసిక కౌన్సిలింగ్‌ అవసరమని అన్నారు. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది తెలియడం లేదని, ఆమెను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేపీసీసీ నేత డీ.కే. శివకుమార్ చెప్పినట్లు కేపీసీసీ నేత డీకే.శివకుమార్‌ చెప్పినట్లు నడుచుకుంటోందని యువతి సోదరుడు ఆరోపించారు.  

వీరి ఆరోపణల మీద కేపీసీసీ నేత డీకే.శివకుమార్‌ మండిపడ్డారు. సీడీ ఘటన తన కుట్రేనని సాక్ష్యాలుంటే పోలీసులకు అందించాలని యువతి తల్లిదండ్రులకు సవాల్ విసిరారు. సోమవారం రాయచూరు ముదగల్ లో  డీకే.శివకుమార్‌ మాట్లాడుతూ తనకు సీడీలోని అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆమె తల్లిదండ్రులు ఒత్తిడిలో ఏమేమో మాట్లాడుతున్నారన్నారు. 

click me!