మావోల దాడి: బీజేపీ ఎమ్మెల్యే సహా ఐదుగురు మృతి

By narsimha lodeFirst Published Apr 9, 2019, 5:52 PM IST
Highlights

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో బీజేపీ కాన్వాయ్‌పై మంగళవారం నాడు మావోయిస్టులు దాడికి దిగారు.  ఈ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి సహా ఐదుగురు మృతి చెందారు

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో బీజేపీ కాన్వాయ్‌పై మంగళవారం నాడు మావోయిస్టులు దాడికి దిగారు.  దంతేవాడ   బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మంగళవారం నాడు దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే మండవి సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు.. ఈ ఘటన దంతెవాడలోని సకులనార్‌లో చోటు చేసుకొంది.

బీజేపీ  ఎమ్మెల్యే భీమ మండవి లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం సహచర బీజేపీ నేతలతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. బీజేపీ నేతల కాన్వాయ్‌లో చివర్లో ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న వాహనం ఉంది. 

ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని  మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఆ తర్వాత మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మండవి సహా ఆరుగు అక్కడికక్కడే మృతి చెందారు.మందుపాతర పేలిన తర్వాత ఎమ్మెల్యే ఆచూకీ గల్లంతైనట్టుగా తొలుత ప్రచారం సాగింది. కానీ చివరకు ఎమ్మెల్యే కూడ మృత్యువాత పడినట్టుగా సమాచారం అందింది. 

 


 

ఎన్నికలను బహిష్కరించాలని మావోలు పిలుపునిచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కూడ తీవ్ర  పరిణామాలు ఉంటాయని కూడ ఇదివరకే మావోలు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవిని  లక్ష్యంగా చేసుకొని మంగళవారం నాడు మావోలు దాడికి దిగారు. రోడ్డు నిర్మాణం సమయంలోనే మావోలు ఈ ప్రాంతంలో మందుపాతరను అమర్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మావోల దాడి తర్వాత సీఆర్‌పీఎప్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఈ ప్రాంతంలో మావోలకు భద్రతా సిబ్బందికి మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే మండవిని మావోలు హత్య చేసిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ హైలెవల్ సమావేశం ఏర్పాటు చేశారు.

 

 

Chhattisgarh: BJP convoy attacked by Naxals in Dantewada. BJP MLA Bheema Mandavi was also in the convoy, further details awaited. pic.twitter.com/MhNVtar2aD

— ANI (@ANI)
click me!