కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వైద్యరంగానికి పెద్ద పీట వేస్తున్నట్టుగా ప్రకటించింది. నిర్మలా సీతారామన్ సోమవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలిపింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వైద్యరంగానికి పెద్ద పీట వేస్తున్నట్టుగా ప్రకటించింది. నిర్మలా సీతారామన్ సోమవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలిపింది.
తొలి ప్రాధాన్యతగా తమ ప్రభుత్వం వైద్య రంగానికి కేటాయిస్తున్నట్టుగా తెలిపింది. ఆ తర్వాత మౌలిక రంగానికి నిధులు కేటాయించనున్నట్టుగా ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్లను కేటాయిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ను ఇండియాతో పాటు మరో 100 దేశాలకు అందిస్తున్నట్టుగా తన ప్రసంగంలో సీతారామన్ గుర్తు చేశారు.
undefined
also read:కేంద్ర బడ్జెట్ 2020-21: విపక్షాల నినాదాల మధ్య బడ్జెట్ సమర్పణ
కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆత్మ నిర్భర్ భారత్ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ. 1.97 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు.
ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి రూ. 2,23,846 కోట్లు కేటాయించినట్టుగా కేంద్ర మంత్రి ప్రకటించారు. అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఆరోగ్య రంగానికి రూ. 641.80 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఎస్ఎల్ -3 స్థాయి ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. 15 ఎమర్జెన్సీ వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.