ప్రజల అంచనాలకు తగినట్లుగానే బడ్జెట్..అనురాగ్ ఠాకూర్

By telugu news teamFirst Published Feb 1, 2021, 11:16 AM IST
Highlights

ఆత్మ నిర్భర భారత్ ద్వారా ఆర్థిక వ్యవస్థను తొందరగా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేట్లు చేశామని, ఆత్మ నిర్భర భారత్  ద్వారా దేశానికి కొత్త దిశను అందించినట్లు ఠాకూర్ పేర్కొన్నారు. 

ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే బడ్జెట్ ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న మంత్రంతోనే ముందడుగు వేస్తోందని పునరుద్ఘాటించారు. ఆత్మ నిర్భర భారత్ ద్వారా ఆర్థిక వ్యవస్థను తొందరగా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేట్లు చేశామని, ఆత్మ నిర్భర భారత్  ద్వారా దేశానికి కొత్త దిశను అందించినట్లు ఠాకూర్ పేర్కొన్నారు. 

కాగా.. ఈసారి బడ్జెట్ ని ట్యాబ్ లో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం.. లెదర్ బ్యాగుల్లో పేపర్లలో బడ్జెట్ తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఆ ఆనవాయితీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చేశారు.

 క‌రోనా వేళ కేంద్ర బ‌డ్జెట్ డిజిట‌ల్ అవ‌తార‌మెత్తింది.  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఈ ఏడాదికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఇవాళ పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.  అయితే ఈ సారి బ‌డ్జెట్‌ను ట్యాబ్లెట్‌‌లో పొందుప‌రిచారు. సాంప్ర‌దాయ‌క‌మైన‌ బ‌హీఖాతా పుస్త‌కం బ‌దులుగా .. లోక్‌స‌భ‌లో ట్యాబ్‌ ద్వారా మంత్రి 2021-22 బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపించ‌నున్నారు.

 ఎర్ర‌టి బ్యాగులో మేడిన్ ఇండియా ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ క‌నిపించారు.  కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ‌మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా మంత్రి సీతారామ‌న్‌తో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ చేరుకున్నారు. పేప‌ర్‌లెస్ బ‌డ్జెట్‌గా గుర్తింపు పొందిన తాజా బ‌డ్జెట్‌కు సంబంధించిన సాఫ్ట్ కాపీని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. 

click me!