రాఖీ కట్నంగా ఒక్కొక్కరికి రూ. 21 వేలు ఇవ్వాలని డిమాండ్.. ఇవ్వకపోవడంతో మరదలిపై తీవ్ర దాడి.. ఎయిమ్స్‌లో చికిత్స

Published : Sep 04, 2023, 05:36 PM IST
రాఖీ కట్నంగా ఒక్కొక్కరికి రూ. 21 వేలు ఇవ్వాలని డిమాండ్.. ఇవ్వకపోవడంతో మరదలిపై తీవ్ర దాడి.. ఎయిమ్స్‌లో చికిత్స

సారాంశం

రక్షా బంధన్ సందర్భంగా వారు సోదరుడికి రాఖీ కట్టారు. ఒక్కొక్కరికి రూ. 21 వేల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోదరుడి భార్య ఈ డిమాండ్‌కు అడ్డుతగిలింది. సోదరుడు డబ్బులు ఇవ్వకపోవడంతో వారంతా కలిసి సోదరుడి భార్యను చితక్కొట్టారు.  

న్యూఢిల్లీ: రాఖీ పండుగ సోదరులు ఎక్కడున్నా వెళ్లి మరీ అక్కా చెళ్లెల్లు రాఖీ కట్టి వస్తారు. తమకు ఆపదలో అండగా ఉండాలని కోరుతారు. చేతికి రాఖీ కట్టించుకున్న తర్వాత సోదరులు ఆడబిడ్డలకు కట్నం వేయడం ఆనవాయితీ. అయితే.. కొన్ని సార్లు ఆడబిడ్డలకు కట్నం కోసం డిమాండ్ కూడా చేస్తారు. ఇలాగే.. మొన్న రక్షా బంధన్ సందర్భంగా ఢిల్లీలో ఓ సోదరుడికి తమ సోదరీమణులు రాఖీ కట్టారు. ఒక్కొక్కరికి రూ. 21 వేలు కట్నంగా వేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కారణంగా ఆడబిడ్డలకు సోదరుడి భార్యకు మధ్య గొడవ జరిగింది. ఢిల్లీలోని మైదీన్ గార్హిలో చోటుచేసుకుంది.

తమ ఆడబిడ్డలు భర్త నుంచి ఒక్కొక్కరు రూ. 21 వేలు రాఖీ కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆమె జీర్ణించుకోలేదు. ఆడబిడ్డలతో సోదరుడి భార్య వాదానికి దిగింది. ఆ వాగ్వాదం పెరిగింది. గొడవకు దారి తీసింది. తమకు ఆ కట్నం రాకపోవడంతో ఆగ్రహంతో గొడవ భౌతిక దాడికి దారితీసింది. 

ఈ గొడవ గురించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆ వ్యక్తి భార్య అనుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆడబిడ్డలు మరింతగా ఆమె పై దాడి చేశారు. వారి సోదరుడి భార్య తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆమెను చేర్చారు.

Also Read: Rains: రెండు గంటల్లోనే 61,000 పిడుగులు.. ఒడిశాలో 12 మంది దుర్మరణం

ఆ మహిళ నర్సుగా పని చేస్తున్నదని పోలీసులు తెలిపారు. ఆమెను భర్త సోదరీమణులు కొట్టారని చెప్పారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 30, 31వ తేదీల్లో నిర్వహించుకున్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?