సహజీవనం బయటపెడుతాడేమో అనే భయంతో సోదరుడి హత్య.. ఎనిమిదేళ్ల తరువాత శరీర భాగాలు లభ్యం..

By Asianet NewsFirst Published Mar 22, 2023, 12:26 PM IST
Highlights

ఇంట్లో నుంచి పారిపోయి సహజీవనం చేస్తున్న సోదరిని సోదరుడు గుర్తించాడు. వారి ఉంటున్న ప్రదేశానికి వెళ్లి ఇంటికి రావాలని సూచించాడు. కానీ ఆమె దానికి నిరాకరించింది. అయితే ఊర్లోకి వెళ్లి ఎక్కడ తమ బంధం గురించి చెప్పేస్తాడేమో అని సోదరి, తన సహజీవన భాగస్వామితో కలిసి సోదరుడిని హత్య చేసింది. 

కర్ణాటకలోని బెంగళూరులో ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఓ సంచలన హత్య ను పోలీసులు తాజాగా చేధించారు. సహజీవాన్ని ఎక్కడ బయటపెడుతాడేమో అని ఓ మహిళ తన సోదరుడిని హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఆపై మూడు సంచుల్లో ప్యాక్ చేసి సరస్సులో పడేశారు. అయితే నిందితులు గత వారం పోలీసులు అరెస్టు చేశారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా శరీర భాగాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కాళ్లు, చేతులు, మొండెం లభించాయి. తల కోసం ఇంకా వెతుకుతున్నారు. 

తండ్రి చివరి కోరికను నెరవేర్చిన కుమారుడు.. మృతదేహం ఎదుటే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు

వివరాలు ఇలా ఉన్నాయి. ఈ కేసు 2015 సంవత్సరానికి చెందినది. బెంగళూరు పోలీసులు భాగ్యశ్రీ అనే మహిళ, ఆమె సహజీవన భాగస్వామి శివపుత్రను అరెస్టు చేయడం ద్వారా ఈ హత్య మిస్టరీని ఛేదించారు. ఎనిమిదేళ్ల క్రితం హత్యకు గురైన వ్యక్తి విజయపుర జిల్లాకు చెందిన లింగరాజు సిద్దప్ప పూజారిగా గుర్తించారు. అతడిని సొంత సోదరే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

విజయపుర జిల్లాకు చెందిన భాగ్యశ్రీ, శివపుత్ర ఇద్దరు కాలేజీ రోజుల నుంచి ప్రేమికులు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. దీంతో వీరిద్దరూ 2015లో బెంగళూరుకు వెళ్లి జిగాని ప్రాంతానికి సమీపంలో ఓ ఇళ్లును అద్దెకు తీసుకొని నివసించడం ప్రారంభించారు. వీరిద్దరూ అక్కడే పని చేసుకుంటూ జీవించడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత వారిద్దరూ ఎక్కడ నివసిస్తున్నారో కుటుంబ సభ్యులకు తెలిసింది.

సైకిల్ కి సేఫ్టీ లైట్... మహిళ వినూత్న ప్రయత్నం..!

భాగ్యశ్రీ సోదరుడు లింగరాజు ఒక రోజు వారు నివసిస్తున్న ఇంటికి వచ్చాడు. శివపుత్ర, తన సోదరి సహ జీవనం చేస్తున్నారని తెలుసుకున్నాడు. ఇది సరైంది కాదని లింగరాజు అభ్యంతరం తెలిపాడు. దీంతో సోదరీ,  సోదరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. అయితే గ్రామంలోకి వెళ్లి ఎక్కడ తమ సహజీవన బంధం గురించి ఊర్లో చెబుతాడేమో అని భయపడి శివపుత్ర, భాగ్యశ్రీ కలిసి లింగరాజును హత్య చేశారు. 

మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత..

ఈ హత్యానంతరం ఇద్దరూ కలిసి అతడి మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. వాటిని గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. ఓ గన్నీ సంచీ, కొన్ని ఎయిర్ బ్యాగ్ లు కొనుగోలు చేశారు. కాళ్లు, చేతులు ఎయిర్ బ్యాగ్ లో ఉంచారు. తలను, మొండెం ను గన్నీ సంచిలో కట్టారు. వాటిని వడ్డెరమంచనహళ్లి సరస్సులోని వివిధ ప్రాంతాలలో సంచులను విసిరారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దానిని ఎట్టకేలకు చేధించారు. అయితే నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా మృతుడి శరీర భాగాలను గాలించారు. కాళ్లు, చేతులు, మొండెం లభించాయి. కానీ తల ఉన్న గన్నీ సంచి ఇంకా లభించలేదు. నిందితుల ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 

click me!