సైకిల్ కి సేఫ్టీ లైట్... మహిళ వినూత్న ప్రయత్నం..!

Published : Mar 22, 2023, 11:09 AM IST
 సైకిల్ కి సేఫ్టీ లైట్... మహిళ వినూత్న ప్రయత్నం..!

సారాంశం

కారు, బైక్ మాదిరిగా సైకిల్ కి కూడా సేఫ్టీ లైట్ ఉంటే.. తన తాతకు ప్రమాదం తప్పి ఉండేదని ఆమె అభిప్రాయపడింది. తన తాతకు జరిగినట్లు మరొకరికి జరగకూడదని ఆమె భావించింది

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి అవనీష్ శరణ్ తరచుగా ఇంటర్నెట్ వినియోగదారుల ఆసక్తిని రేకెత్తించే ఆకర్షణీయమైన పోస్ట్‌లను షేర్ చేస్తుంటారు. ఈసారి, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి 22 ఏళ్ల మహిళ చేస్తున్న వినూత్న ప్రయత్నానికి సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. ఆ మహిళ వీడియోలో సైకిళ్లపై సేఫ్టీ లైట్లను అమర్చుతుండటం విశేషం.

లక్నోకు చెందిన ఖుషీ పాండే రోడ్డు ప్రమాదంలో తన తాతయ్యను కోల్పోయింది. ఆమె తాత సైకిల్‌పై వెళుతుండగా అతడిని  కారు ఢీకొట్టింది. కారు, బైక్ మాదిరిగా సైకిల్ కి కూడా సేఫ్టీ లైట్ ఉంటే.. తన తాతకు ప్రమాదం తప్పి ఉండేదని ఆమె అభిప్రాయపడింది. తన తాతకు జరిగినట్లు మరొకరికి జరగకూడదని ఆమె భావించింది.     అందుకే  అప్పటి నుండి, శ్రీమతి పాండే సైకిళ్లపై 1500 ఉచిత రెడ్ లైట్లను అమర్చారు.

ఆమె నగరంలోని కీలక కూడళ్లలో "సైకిల్ పె లైట్ లాగ్వావో" అని రాసి ఉన్న ప్లకార్డ్‌ని పట్టుకుని నిలబడి ఉండటం తరచుగా చూడవచ్చు. కాగా... ఈ వీడియో ఇంటర్నెట్‌లో నెటిజన్ల  హృదయాలను గెలుచుకుంటుంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు శ్రీమతి పాండే ప్రయత్నాలను మెచ్చుకున్నారు. ఆమె చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమెకు దేవుని ఆశీస్సులు ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆమె చేస్తున్న ప్రయత్నం.. అందరూ మెచ్చుకోదగినదే కదా.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?