సిసోడియా నిజాయితీ దేశం మొత్తం నిరూప‌ణ అయ్యింది - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

By team teluguFirst Published Aug 30, 2022, 4:43 PM IST
Highlights

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నిజాయితీ దేశం మొత్తం నిరూపణ అయ్యిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

మనీష్ సిసోడియా నిజాయితీ, దేశభక్తి యావత్ దేశం ముందు నిరూపితమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం బ్యాంక్ లాకర్‌లో సీబీఐకు ఏమీ కనిపించలేదని చెప్పారు. ‘డర్టీ పాలిటిక్స్’ వల్లే ఈ చర్య జరిగిందని కేజ్రీవాల్ ఆరోపించారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం.. అన్ని విచారణలను రద్దు చేస్తూ...

ఘజియాబాద్‌లోని వసుంధరలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో సీబీఐకి చెందిన నలుగురు సభ్యుల బృందం దాదాపు రెండు గంటల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సిసోడియా, ఆయన భార్య అక్కడే ఉన్నారు.

ప్రభుత్వ ఉద్యోగిని స్తంభానికి కట్టేసిన రైతులు.. ఎరువులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మండిపాటు

ఈ ప‌రిణామాల‌పై కేజ్రీవాల్ స్పందించారు. ‘‘ మనీష్ ఇంటి నుంచి, అతడి లాకర్ నుండి ఏమీ ల‌భించ‌లేదు. సీబీఐకు తన అన్వేషణలో ఏమీ దొర‌క‌లేదు. మనీష్ నిజాయితీ, దేశభక్తి యావత్ దేశం ముందు నిరూపితమైంది. ఈ మొత్తం చర్య డర్టీ రాజకీయాల వల్ల ప్రేరేపించబడిందని స్పష్టంగా తెలుస్తుంది.’’ అని సిసోడియా విలేకరులతో మాట్లాడిన వీడియో క్లిప్ ను షేర్ చేసుకుంటూ కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. 

ఉత్తరాఖండ్‌లో గ్యాస్ లీక్.. 20 మందికి పైగా అస్వస్థత

కాగా.. సీబీఐ టీం సుమారు రెండు గంటల పాటు తన లాకర్‌ను ప‌రిశీలించింద‌ని మ‌నీష్ సిసోడియా అని చెప్పారు. ప‌రిశీల‌నల త‌రువాత ద‌ర్యాప్తు సంస్థ త‌న‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయ‌న తెలిపారు. సీబీఐ ఒత్తిడితో ప‌ని చేస్తోంద‌ని ఆయ‌న తెలిపారు.  ‘‘ ఈరోజు సోదాల్లో సీబీఐ నుంచి నాకు క్లీన్ చిట్ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా లాకర్, నివాసంలో చేసిన సోదాల్లో వారికి ఎలాంటి ఆధారాలూ క‌నుగొన‌లేక‌పోయారు. లాకర్‌లో నా పిల్లలు, భార్యకు చెందిన సుమారు రూ. 70,000 విలువైన ఆభరణాలు ఉన్నాయి.’’ అని సిసోడియా చెప్పారు.
 

click me!