ప్రభుత్వ ఉద్యోగిని స్తంభానికి కట్టేసిన రైతులు.. ఎరువులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మండిపాటు

By Mahesh KFirst Published Aug 30, 2022, 4:16 PM IST
Highlights

బిహార్‌లో వ్యవసాయ శాఖ నియమించిన సలహాదారు స్థానిక వ్యాపారులతో కుమ్మక్కై ఎరువుల ధరలను ఇష్టారీతిన పెంచుతున్నారని రైతులు ఆగ్రహించారు. సదరు ప్రభుత్వ ఉద్యోగిని స్తంభానికి కట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

న్యూఢిల్లీ: ఎరువులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, స్థానిక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎరువుల వ్యాపారులతో కుమ్మక్కై ధరలు ఇష్టారీతిన పెంచేస్తున్నారని బిహార్‌లోని రైతులు మండిపడ్డారు. ఈ ఆగ్రహంతోనే ఆ ఉద్యోగిని రైతులు అందరూ కలిసి ఓ స్తంభానికి కట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన మోతిహరి జిల్లాలో చోటుచేసుకుంది.

ఆ వైరల్ వీడియోలోని ఉద్యోగిని నితిన్ కుమార్ అని గుర్తించారు. వ్యవసాయ శాఖ నియమించిన కిసాన్ సలహాకార్ అని అడ్వైజర్‌గా నియమించింది. అయితే, ఈ ఉద్యోగి స్థానిక వ్యాపారులు కొందరు కలిసి ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, తద్వార బ్లాక్ మార్కెట్‌కు రెక్కలు తొడుగుతున్నారని రైతులు ఆరోపించారు. అంతేకాదు, ఆ ఎరువులకు ఇష్టమున్నట్టుగా ధరలు పెంచి అమ్ముతున్నారని తెలిపారు. 

యూరియా ఒక బ్యాగ్ ప్రభుత్వ ధర రూ. 265 ఉన్నదని రైతులు తెలిపారు. కానీ, వీరంతా కుమ్మక్కూ ఈ యూరియా సంచిని రూ. 500 నుంచి రూ. 600 వరకు అమ్ముతున్నారని ఆరోపణలు చేశారు. 

खाद की कालाबाज़ारी से तंग आकर मोतिहारी में कृषि सलाहकार को किसानों ने खंभे से बांध दिया ⁦⁩ pic.twitter.com/UMfOKrug79

— manish (@manishndtv)

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగానే.. సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. సర్కిల్ అధికారి స్పాట్‌కు చేరుకుని రైతులకు సర్ది చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. తద్వార ఉద్యోగి నితిన్ కుమార్‌ను రైతులు విడిచిపెట్టారు. ఇకపై రైతులు తమకు సరిపడా ఎరువులు పొందుతారని, అది కూడా ప్రభుత్వ రేటుకే వారికి అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చిన తర్వాత రైతులు నితిన్ కుమార్‌ను విడిచిపెట్టారు.

click me!