భారత శాస్త్రజ్ఞుల ఘనత.. అన్ని వేరియంట్లకు విరుగుడుగా ఒకే టీకా.. ప్రాథమిక దశ పూర్తి

Published : Feb 06, 2022, 08:47 PM ISTUpdated : Feb 06, 2022, 08:52 PM IST
భారత శాస్త్రజ్ఞుల ఘనత.. అన్ని వేరియంట్లకు విరుగుడుగా ఒకే టీకా.. ప్రాథమిక దశ పూర్తి

సారాంశం

భారత దేశ శాస్త్రజ్ఞులు మరోసారి తమ ఘనతను ప్రపంచానికి చాటుతున్నారు. కరోనా వైరస్‌ అన్ని వేరియంట్లను ఎదుర్కొనే సింగిల్ టీకాను కనుగొనడానికి శ్రీకారం చుట్టారు. కరోనావైరస్ భవిష్యత్ వేరియంట్లను కూడా నిలువరించే శక్తి గల పెప్టైడ్ వ్యాక్సిన్‌ను కనుగొంటున్నట్టు వెల్లడించారు. ఈ టీకా కరోనా వైరస్ కుటుంబంలోని అన్ని వేరియంట్లను ఎదుర్కోగలదని తెలిపారు.   

న్యూఢిల్లీ: భారత శాస్త్రజ్ఞులు మరో ఘనత సృష్టించారు. కరోనా వైరస్‌ పీచమణచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఒకవేరియంట్ తర్వాత మరోటి పంజా విసురుతుండటంతో వ్యాక్సిన్ సామర్థ్యాలపై అనుమానాలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అయితే.. ఏకంగా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తప్పించుకునే శక్తి కలిగి ఉన్నదనే అధ్యయనాలే వచ్చాయి. అయినప్పటికీ ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి బూస్టర్ డోసు అందించే పనిలో ప్రభుత్వాలు పడ్డాయి. ఇది వరకు అభివృద్ధి చేసి పంపిణీ చేస్తున్న టీకాలు భవిష్యత్‌లో పరిణామం చెందే కొత్త వేరియంట్లను ఎదుర్కోగలవా? అనే సంశయాలు నెలకొన్నాయి.

కాజి నజ్రుల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ శుభవార్తను అందించారు. కరోనా వైరస్ భవిష్యత్ వేరియంట్లనూ ఎదుర్కొనే టీకాను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ పెప్టైడ్ వ్యాక్సిన్ భవిష్యత్‌లోనూ వచ్చే కొత్త వేరియంట్లను సమర్థంగా ఢీకొట్టగలవని అసన్సోల్‌లోని కాజి నజ్రుల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భువనేశ్వర్‌లు తెలిపారు. 

వారి రీసెర్చ్ జర్నల్‌ను ప్రచురించడానికి ప్రసిద్ధమైన జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ లిక్విడ్స్  అంగీకరించింది. తాము అభిస్‌కొవాక్ వ్యాక్సిన్ డెవలప్‌ చేయడానికి తాము వినూత్నమైన విధానాన్ని అవలంభించామని శాస్త్రజ్ఞులు తెలిపారు. కరోనావైరస్ కుటుంబానికి చెందిన ఆరు ప్రమాదకరమైన సభ్యులను ఎదుర్కొనే విధంగా ఇమ్యేనోఇన్ఫర్మాటిక్‌ విధానాన్ని పాటించామని వివరించారు. తాము అభివృద్ధి చేస్తున్న ఈ టీకా సుస్థిరమైనదిగా, ఇమ్యునోజెనిక్, యాంటీజెనిక్‌గా ఉన్నదని పేర్కొన్నారు. తాము కంప్యూటేషనల్ మెథడ్స్ ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేశామని తెలిపారు. ఇదింకా ప్రాథమిక దశలోనే ఉన్నది. తర్వాత దాని ఉత్పత్తి.. ఆ తర్వాత దాని పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది.

ఈ టీకా ప్రత్యేకమైనదని, ఏక కాలంలోనే కరోనా వైరస్ కుటుంబంలోని అన్ని సభ్యులను ఎదుర్కొనే సామర్థ్యంతో ప్రపంచంలో ఇది వరకు ఒక్క టీకా కూడా లేదని వారు వివరించారు. కరోనా వైరస్ కుటుంబంలోని వేరియంట్లు, ఇతర వైరస్‌లలో కొంత కాలంగా జరుగుతున్న మార్పులను వారు పరిశీలించారు. అయితే, వాటి స్పైక్ ప్రోటీన్‌లు చాలా స్వల్పమైన మార్పులే జరుగుతున్నాయని వారు గుర్తించారు.

తెలంగాణలో కరోనా కేసులు (corona cases in telangana) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 74,083 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,098 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,76,313కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో (corona deaths in telangana) వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,099కి చేరింది. కోవిడ్ బారి నుంచి నిన్న 3,801 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 29,226 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ అత్యధికంగా 629 కేసులు నమోదయ్యాయి. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 36, భద్రాద్రి కొత్తగూడెం 75, జీహెచ్ఎంసీ 629, జగిత్యాల 56, జనగామ 34, జయశంకర్ భూపాలపల్లి 12, గద్వాల 6, కామారెడ్డి 19, కరీంనగర్ 60, ఖమ్మం 101, మహబూబ్‌నగర్ 52, ఆసిఫాబాద్ 14, మహబూబాబాద్ 31, మంచిర్యాల 48, మెదక్ 41, మేడ్చల్ మల్కాజిగిరి 98, ములుగు 19, నాగర్ కర్నూల్ 17, నల్గగొండ 86, నారాయణపేట 17, నిర్మల్ 41, నిజామాబాద్ 55, పెద్దపల్లి 49, సిరిసిల్ల 41, రంగారెడ్డి 117, సిద్దిపేట 46, సంగారెడ్డి 59, సూర్యాపేట 62, వికారాబాద్ 22, వనపర్తి 19, వరంగల్ రూరల్ 27, హనుమకొండ 57, యాదాద్రి భువనగిరిలో 52 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?