UP Elections 2022: ఈ ఎన్నికలతో మరిన్ని చిన్న పార్టీలు ఆవిర్భావం.. పవర్‌ఫుల్ క్యాస్ట్ లీడర్లకు నాంది

Published : Feb 06, 2022, 07:09 PM IST
UP Elections 2022: ఈ ఎన్నికలతో మరిన్ని చిన్న పార్టీలు ఆవిర్భావం.. పవర్‌ఫుల్ క్యాస్ట్ లీడర్లకు నాంది

సారాంశం

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్రంలో మరిన్ని చిన్న పార్టీల ఆవిర్భవానికి, కొత్త పవర్‌ఫుల్ లీడర్ల పుట్టుకకు నాందీ పలుకవచ్చని తెలుస్తున్నది. యూపీలో చిన్న చిన్న పార్టీలు.. కులాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభావశీల పార్టీలు ఉన్నాయి. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న కులాలు పార్టీలను నెలకొల్పడం.. రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తుండటాన్ని ఇప్పుడుచూస్తూనే ఉన్నాం.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చిన్న చిన్న పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవి ఎన్నికల సరళినే మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. ఒక్కోసారి అధికారాన్నీ అందించే కింగ్ మేకర్లుగానూ మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కులాలను ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభావశీలంగా ఉంటున్న పార్టీలు చాలా ఉన్నాయి. సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీ, అప్నా దళ్ సహా పలు పార్టీలు యూపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు మరిన్ని చిన్న చిన్న పార్టీల ఆవిర్భవానికి, కులాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభావశీల నేతల సృష్టికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు భాగంలో రాజ్‌భర్ కమ్యూనిటీ ప్రాబల్యం ఎక్కువ. ఈ కమ్యూనిటీ ప్రాతినిధ్యం వహిస్తూ వెలుగొందుతున్న పార్టీనే సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీ. ఈ పార్టీకి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సారథ్యం వహిస్తున్నారు. అలాగే, అనుప్రియ పటేల్ సారథ్యంలోని అప్నా దళ్, క్రిష్ణ పటేల్ సారథ్యంలోని అప్నా దళ్(కమరవాడి)లూ కుర్మీ క్యాస్ట్ ప్రాబల్యంతో ఏర్పడ్డవి. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మౌర్య, కొయిరి, కుశ్వాహా క్యాస్టులకు న్యాయం చేసే పార్టీగా మహాన్ దళ్‌ను చూస్తున్నారు.

కాగా, యూపీలో నిషద్ క్యాస్ట్‌ ఓట్లను సంజయ్ నిషద్ సారథ్యంలోని రాష్ట్రీయ నిషద్ పార్టీ రాబట్టుకుంటున్నది. కాగా, యూపీలోని పలు ప్రాంతాల్లో కుశ్వాహా కమ్యూనిటీని బలంగా జన్ అధికార్ పార్టీ ఆకట్టుకుంటున్నది. ఈ పార్టీ చీఫ్‌గా గతంలో బీఎస్పీ నేతగా వెలుగొందిన బాబు సింగ్ కుశ్వాహా ఉన్నారు. ఈ నాయకులంతా కులాలకు ప్రాతినిధ్యం వహించే నేతలుగానే ప్రాచుర్యం పొందారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ నేతలు తమ కులాల ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తుంటారు. వారి రాజకీయ ఎజెండాలోనూ కుల ప్రాధాన్యత అగ్రస్థానంలో కనిపిస్తుంటుంది. ఈ పార్టీల్లోని క్యాడర్ కూడా అదే కులాల నుంచి ఎక్కువగా ఉంటారు. డొనేషన్లు, సహాయ కార్యక్రమాలు వారి వారి మధ్యే జరుగుతుంటాయి.

ఇవి రాజ్‌భర్, నిషద్, మౌర్య, కుశ్వాహా వంటి కులాల్లో పెరిగిన రాజకీయ అవగాహనను వెల్లడిస్తున్నాయి. ఇవి ప్రజాస్వామ్యంలో తమ న్యాయమైన వాటాను పొందడానికి బలంగా గళం ఎత్తుతుంటాయి. తద్వారా ఈ కుల ఆధారిత పార్టీలు తమ తమ వాటాను ప్రజాస్వామిక విధానంలో పొందుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇలా కుల ఆధారిత పార్టీలు చాలా ఉన్నాయి. అయితే, ఇంకా ఈ స్థాయిలో ప్రభావవంతంలో లేని కులాలు కూడా చాలా ఉన్నాయి. వాటి సమస్యలను, డిమాండ్లను ప్రధాన స్రవంతి పార్టీలు ఎజెండాలో కనిపించడం లేదు. అలాంటి కులాలు ఇప్పటికే అసోసియేషన్లు, ఇతర సంఘాలు నెలకొల్పుకుని కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఈ ఎన్నికలతో వారిలోనూ రాజకీయ అవగాహన మరింత పెరిగే అవకాశం ఉన్నది. తద్వార మరిన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు, ఆయా కులాల డిమాండ్లను బలంగా వెల్లడించే ప్రభావశీల నేతలూ ఈ ఎన్నికల తర్వాత పుట్టుకు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?