"సిఎం సిద్ధరామయ్య" ఛాతిపై టాటూ వేయించుకున్న యువకుడు.. వీడియో వైరల్

Published : May 13, 2023, 02:41 PM IST
"సిఎం సిద్ధరామయ్య" ఛాతిపై టాటూ వేయించుకున్న యువకుడు.. వీడియో వైరల్

సారాంశం

కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో మైసూరులో ఒక వ్యక్తి తన ఛాతీపై "సిద్దరామయ్య సిఎం" అని వేయించుకున్న పచ్చబొట్టు వీడియో వైరల్ గా మారింది. 

కర్ణాటక : కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో మైసూరులో ఓ మద్దతుదారుడు తన ఛాతీపై ‘సిఎం సిద్ధరామయ్య’ అని టాటూ వేయించుకున్నాడు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ఊహాగానాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఈ ఉన్న తరుణంలో ఓ వ్యక్తి తన టాటూను చూపుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు, అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేతలు సిద్ధరామయ్య, డికె శివకుమార్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి కాగా, మరొకరు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్.

'40% కమీషన్ ప్రభుత్వం' నినాదాన్ని ప్రజలు ఆమోదించారు : సచిన్ పైలట్

రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ఉదయం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు, ఎన్నికలలో బలమైన ఆధిక్యత తర్వాత, డికె శివకుమార్ ఉద్వేగానికి లోనయ్యారు. నేను కర్ణాటకలో పార్టీని తిరిగి తీసుకొస్తానని సోనియా గాంధీకి హామీ ఇచ్చానని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీకి 113 సీట్లు గెలుచుకోవాలి. కాంగ్రెస్ ఇప్పటికే 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Man engraved with ‘Siddaramaiah CM’ tattoo on his chest in Mysuru, as Congress consolidates win in Karnataka elections <a href="https://t.co/fiu0JiFZ4T">pic.twitter.com/fiu0JiFZ4T</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1657283000718229505?ref_src=twsrc%5Etfw">May 13, 2023</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?