బీజేపీకి గెలుపు, ఓటములు కొత్త కాదు.. ప్రజా తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నాం: యడియూరప్ప

Published : May 13, 2023, 02:27 PM IST
బీజేపీకి గెలుపు, ఓటములు కొత్త కాదు.. ప్రజా తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నాం: యడియూరప్ప

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా సాగుతుంది. ఈ ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. గెలుపు, ఓటములు బీజేపీకి  కొత్త కాదని అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా సాగుతుంది. ఈ ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. గెలుపు, ఓటములు బీజేపీకి  కొత్త కాదని అన్నారు. తమ పార్టీ 2 సీట్లతో ప్రస్తానం ప్రారంభించి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఈ ఫలితాలతో పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కర్ణాటక అభివృద్ది సాకారమైందని అన్నారు. పార్టీ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నామని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అంగీకరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తమ పార్టీ నాయకులంతా ఎంతో ప్రయత్నించామని అన్నారు. కానీ గెలువలేకపోయామని చెప్పారు. ఈ ఫలితాలను విశ్లేషించుకొని, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Also Read: సోనియా గాంధీకి మాటిచ్చాను.. కర్ణాటక ఫలితాలపై డీకే శివకుమార్ భావోద్వేగం.. సీఎం రేసుపై ఏం చెప్పారంటే.. (వీడియో)

‘‘ప్రధాని, బీజేపీ కార్యకర్తలు ఎంత ప్రయత్నించినా మేం ఆ ముద్ర వేయలేకపోయాం. కాంగ్రెస్ విజయవంతంగా ఆ పని పూర్తి చేసింది. పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన తర్వాత మేము సమగ్ర విశ్లేషణ చేస్తాం. జాతీయ పార్టీగా వివిధ స్థాయిల్లో ఎలాంటి లోటుపాట్లు, అంతరాలు మిగిల్చాయో విశ్లేషించుకుంటాం. ఈ ఫలితాన్ని మా పురోగతిలో తీసుకుంటాము. లోక్ సభ ఎన్నికల్లో తిరిగి రావడానికి ఈ ఫలితాన్ని మేం పరిగణిస్తాం’’ అని బసవరాజ్ బొమ్మై అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్