కరోనాపై 110 ఏళ్ల బామ్మ విజయం సాధించారు.కరోనా సోకినవారిలో 60 ఏళ్ల వయస్సుపై బడిన వాళ్లు ఎక్కువగా మరణిస్తున్నారు.అయితే వందేళ్లు దాటిన వృద్ధురాలు మాత్రం ఈ వైరస్ పై నెగ్గారు. ఆసుపత్రి నుండి ఆమె డిశ్చార్జ్ అయ్యారు.
బెంగుళూరు: కరోనాపై 110 ఏళ్ల బామ్మ విజయం సాధించారు.కరోనా సోకినవారిలో 60 ఏళ్ల వయస్సుపై బడిన వాళ్లు ఎక్కువగా మరణిస్తున్నారు.అయితే వందేళ్లు దాటిన వృద్ధురాలు మాత్రం ఈ వైరస్ పై నెగ్గారు. ఆసుపత్రి నుండి ఆమె డిశ్చార్జ్ అయ్యారు.
also read:కరోనాను జయించిన 105 ఏళ్ల బామ్మ: 3 నెలలు కోవిడ్ పై పోరాటం
undefined
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలోని 110 ఏళ్ల సైదమ్మ అనే వృద్దురాలు కరోనాను నుండి కోలుకొన్నారు. శనివారం నాడు ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.వైద్యులు, వైద్య సిబ్బంది హర్షధ్వానాల మధ్య ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
also read:కరోనాతో యూపీలో మంత్రి కమల్ రాణి మృతి
ఈ ఏడాది జూలై 27వ తేదీన సైదమ్మ కరోనా సోకింది. ఆమెను చిత్రదుర్గలోని కరోనా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన చికిత్సతో పాటు ఆహారంతో ఆమె కోలుకొంది.ఈ విషయాన్ని ఆమె మీడియాకు తెలిపారు.
తనకు కరోనా సోకిందని భయపడలేదన్నారు. తాను ఎవరికీ కూడ భయపడనని ఆమె తేల్చి చెప్పారు. 110 ఏళ్ల సైదమ్మ కరోనా నుండి కోలుకోవడం తనకు సంతోషంగా ఉందని వైద్యుడు బసవరాజ్ చెప్పారు.పోలీస్ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి సైదమ్మ తల్లి. కొడుకుతో కలిసి పోలీస్ క్వార్టర్ లో ఆమె నివాసం ఉంటుంది.
గతంలో 96 ఏళ్ల వృద్దురాలు కూడ కరోనా నుండి కోలుకొన్నారని డాక్టర్ బసవరాజ్ గుర్తు చేసుకొన్నారు. కేరళలో కూడ 105 ఏళ్ల బామ్మ కూడ కరోనా నుండి కోలుకొన్నారు. ఆమెను కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శైలజ అభినందించారు.