కరోనాతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న కమల్ రాణి ఆదివారం నాడు మరణించారు. ఆమె వయస్సు 62 ఏళ్లు. ఈ నెల 18వ తేదీన ఆమె కరోనా కోసం చికిత్స కోసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఆమె టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కారణంగా ఆమె మరణించింది. ఆమెను రక్షించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ ఆమెను రక్షించలేకపోయినట్టుగా పీజీఐ డైరెక్టర్ ప్రోఫెసర్ రాధాకృష్ణ ధీమన్ తెలిపారు.మంత్రి కమల్ రాణి మృతి పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఆమె పనిచేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు.
undefined
ఈ నెల 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించనుంది. ఈ భూమి పూజ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై సీఎం యోగి ఆధిత్యనాథ్ సమీక్ష నిర్వహించేందుకు గాను అయోధ్యకు ఇవాళ వెళ్లాల్సి ఉంది. మంత్రి కమల రాణి మృతితో అయోధ్య పర్యటనను సీఎం యోగి ఆదిత్యనాథ్ వాయిదా వేసుకొన్నారు.
కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కనీసం రోజుకు 50 వేల కేసులు నమోదౌతున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరిగిపోతున్నా రికవరీ రేటు కూడ పెరిగిపోవడం కూడ కొంత ఊరట కల్గించే అంశంగా వైద్యులు చెబుతున్నారు.