మరోసారి భారతదేశంలో కేసుల సంఖ్య 50 వేలను దాటింది. ఇలా 50,000 కేసులను ఒక్కరోజులో దాటడం ఇది వరుసగా నాలుగవ రోజు. నిన్నొక్కరోజే 54,735 కేసులు నమోదవుతుండడంతో.... మొత్తం కేసుల సంఖ్య 17 లక్షల మార్కును దాటింది.
భారతదేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. మరోసారి భారతదేశంలో కేసుల సంఖ్య 50 వేలను దాటింది. ఇలా 50,000 కేసులను ఒక్కరోజులో దాటడం ఇది వరుసగా నాలుగవ రోజు. నిన్నొక్కరోజే 54,735 కేసులు నమోదవుతుండడంతో.... మొత్తం కేసుల సంఖ్య 17 లక్షల మార్కును దాటింది. మొత్తం కేసుల సంఖ్య 17,50,723 కి చేరుకున్నాయి.
గడిచిన 24 గంటల్లో 853 మంది కారొనతో మరణించగా, ఇప్పటివరకు ఈ మహమ్మారి వల్ల మరణించినవారి సంఖ్య 37,364 కి చేరింది. ప్రస్తుతానికి దేశంలో 5,67,730 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
undefined
నిన్నొక్కరోజే 5 లక్షల 25 వేలకు పైగా టెస్టులను నిర్వహించినట్టుగా డాటాలో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పటివరకు దేశంలో 1కోటి 93 లక్షల పైచిలుకు టెస్టులను నిర్వహించారు.
ఇకపోతే... దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ లో మాత్రం రోజు రోజుకీ కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు అత్యధిక కరోనా కేసులతో తల్లడిల్లిన ఢిల్లీ.. ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకుంటుంది.
అత్యధిక కరోనా ప్రభావిత 20 జిల్లాలలో సెంట్రల్ ఢిల్లీ కూడా ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జూన్‌లో ఇక్కడ ప్రతిరోజూ 350కు పైగా కరోనా కేసులు నమోదయ్యేవి. అయితే జూలైలో ఇది 100 కు చేరుకుంది. సెంట్రల్ ఢిల్లీ విషయానికొస్తే దీనిని మూడు ఉపవిభాగాలుగా విభజించారు.
ఇందులో సివిల్ లైన్స్, కరోల్‌బాగ్, కొత్వాలి, బురారి తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఎర్రకోట, జామా మసీదు ప్రాంతాలు ఎంతో రద్దీగా ఉంటాయి. ఈశాన్య ఢిల్లీ తరువాత రాజధానిలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 27,730 మంది ఉంటున్నారు.
ఈ ప్రాంతంలో కరోనా కేసుల గురించి సర్వే నిర్వహించినపుడు జిల్లాలో 28 శాతం మందికి వ్యాధి సోకినట్లు వెల్లడయ్యింది. అయితే వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమై, పరిస్థితిని సకాలంలో నియంత్రించారు.
జిల్లాలో 5.8 లక్షల జనాభా ఉంది. వారిలో 10,761 కరోనా బాధితులు ఉన్నారు. వీరిలో 6,721 మంది పురుషులు, 4,040 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ కరోనా నియంత్రణకు అధికారులు ప్రతిప్రాంతానికి అనుగుణంగా భిన్నమైన వ్యూహాన్ని రూపొందించి,
కరోనాను అదుపులోకి తీసుకువచ్చారు. దీనిపై సెంట్రల్ ఢిల్లీ డిఎం నిధి శ్రీవాస్తవ మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా కరోనాకు ప్రభావితమైన 20 జిల్లాల్లో సెంట్రల్ ఢిల్లీ ఒకటని, తొలుత ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని, ప్రజల తీరుతెన్నులను అర్థం చేసుకుని కరోనా కట్టడికి ప్రణాళికలు వేశామన్నారు. కరోనా సోకిన వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించడంలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చిందని తెలిపారు.